Harish Shankar: నా టైటిల్ గుర్తుండకపోవచ్చు , నా సినిమా ఎప్పటికి గుర్తుంటుంది.

షాక్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ మొదటి సినిమాతోనే షాక్ తిన్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ రవితేజ హీరోగా మిరపకాయ సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. హరీష్ శంకర్ అంటే టక్కున గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. దబాంగ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ కంటే కూడా మంచి విజయాన్ని సాధించి పవన్ కెరియర్ కి 11 ఏళ్ల తర్వాత మర్చిపోలేని హిట్ ఇచ్చింది.

ఇప్పటికీ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. హరీష్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చిన చేసినా గబ్బర్ సింగ్ స్థాయి వేరు, గబ్బర్ సింగ్ స్థానం వేరు. ఒక దర్శకుడిగా హరీష్ కి ఎనలేని కీర్తిని తెచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ లో మిస్ అయిన ఎనర్జీని గబ్బర్ సింగ్ సినిమాతో బయటకు తీసి ఇండస్ట్రీ హిట్ అయ్యేలా చేశాడు హరీష్.

ప్రస్తుతం హరీష్ చేస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ స్టేజ్ పైన మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ ని మర్చిపోయాడు. ఆ సమయంలో ఆడియన్స్ “ఉస్తాద్ భగత్ సింగ్” అని గుర్తు చేశారు.

- Advertisement -

ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్లో హరిష్ శంకర్ ని సినిమా టైటిల్ మర్చిపోయారు, సో ప్రాజెక్ట్ కూడా ఆపే అని కొంతమంది ట్రోల్ చేయటం మొదలెట్టారు. వీటికి హరీష్ రియాక్ట్ అవుతూ మా సినిమా పేరు గుర్తుండకపోవచ్చు, కానీ నేను ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేస్తానంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపించడంలో హరీష్ తోపు అని చెప్పచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు