Hero Rajasekhar: ఒక పక్క అప్పులు, మరో పక్క కేసులు – గతి లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి..!

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, ఈ పేరు వింటే అంకుశం లాంటి పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలు, మా అన్నయ్య, గోరింటాకు వంటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు సైమల్టేనియస్ గా గుర్తొస్తాయి. ఏక కాలంలో అటు మాస్ ఆడియన్స్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగలిగిన అరుదైన నటుడు రాజశేఖర్. అయితే, అదంతా ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

వరుస డిజాస్టర్స్ తో ఆల్మోస్ట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. సాధారణంగా ఏజ్ పెరిగి, కెరీర్ ఎండింగ్ స్టేజ్ కి చేరుకున్నప్పుడు ఏ యాక్టర్ అయినా కాంప్రమైజ్ అయ్యి వచ్చిన ఆఫర్స్ యాక్సెప్ట్ చేస్తుంటారు. జగపతి బాబు, శ్రీకాంత్ లు ఇందుకు ఉదాహరణ. కానీ, రాజశేఖర్ మాత్రం చేస్తే హీరోగానే చేస్తా తప్ప విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. వెంకటేష్ మహా లాంటి చాలా మంది యంగ్ డైరెక్టర్స్ కథలు తీసుకొని వెళ్లగా రాజశేఖర్, జీవిత వేలు పెట్టి మార్పులు చేర్పులు చేయమని కోరుతూ ఉండటంతో ఏ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వటం లేదు.

రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ అందరినీ షాక్ కి గురి చేసింది. అదేంటంటే నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందుతున్న ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో విలన్ రోల్ లో రాజశేఖర్ నటిస్తున్నాడన్న వార్త. హీరోగా మాత్రమే చేస్తానని పట్టు పట్టిన రాజశేఖర్ ఇప్పుడు సడన్ గా విలన్ రోల్ యాక్సెప్ట్ చేయటానికి సరైన రీజన్ ఉందని సమాచారం అందుతోంది. అదేంటంటే రాజశేఖర్ కి అప్పులు ఎక్కువయ్యాయని, అందువల్లే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడని తెలుస్తోంది.

- Advertisement -

రామబాణం సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ కోసం ముందుగా రాజశేఖర్ ని అనుకున్నాడట డైరెక్టర్, ఈ మేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నాడట రాజశేఖర్. సీన్ కట్ చేస్తే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేని స్థితికి వచ్చాడట యాంగ్రీ హీరో.

అప్పులు మాత్రమే కాకుండా కోర్ట్ కేసులు కూడా జీవిత రాజశేఖర్ లను చుట్టు ముట్టాయట. ఫైనాన్సియల్ గా, పొలిటికల్ గా ఎదురు దెబ్బలు తిన్న రాజశేఖర్ దంపతులకు ఇండస్ట్రీలో కూడా ప్రతికూల వాతావరణం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే సర్వం కోల్పోయిన దశలో ఉన్న రాజశేఖర్ కి నితిన్ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని చెప్పాలి. మరి, సెకండ్ ఇన్నింగ్స్ క్లిక్ అయ్యి పీకల్లోతు కష్టాల నుండి జీవిత రాజశేఖర్ లు బయటపడతారా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు