Rajasekhar: జగపతిబాబు బాటలో

పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చింది.
ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తన సినిమాకి మంచి కలక్షన్సే రాబట్టాడు అనిల్. కానీ చాలామంది మాములు ప్రేక్షకులుకు అనిల్ చేసిన ఈ రెండు సినిమాలు పెద్దగా ఎక్కలేదు.
అవే కుళ్ళు జోకులు, జబర్దస్త్ తరహా స్కిట్స్ లా అనిపించాయి అనేది చాలామంది అభిప్రాయం.

ఎట్టకేలకు అనిల్ ఇప్పుడు బాలయ్య తో ఒక కమర్షియల్ మూవీ చేయబోతున్నాడు, కమర్షియల్ మూవీ లో కూడా అనిల్ స్ట్రెంత్ అయినటువంటి కామెడీని వదలకుండా #NBK108 సినిమాను తెరకెక్కించనున్నాడు అనిల్. #NBK108 లో బాలయ్యకి ప్రతినాయకుడిగా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కనిపించనున్నట్లు సమాచారం. హీరోగా ఎన్నో మంచి హిట్ సినిమాలు చేసి, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైన రాజశేఖర్, #NBK108 లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారు అంటే ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే క్యూరియాసిటీ చాలామందికి ఏర్పడుతుంది.

వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఉపేంద్ర పాత్రకోసం ముందుగా రాజశేఖర్ ను సంప్రదించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను రాజశేఖర్ తిరస్కరించడంతో ఆ పాత్రను ఉపేంద్ర చేసారు. హీరోగా ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న రాజశేఖర్ సినిమాలకు ఈ మధ్యకాలంలో ఆదరణ లభించట్లేదు, అందుకే లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా మారినట్లు #NBK108 తో రాజశేఖర్ విలన్ మారనున్నాడు అనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు