Jeevitha Rajasekhar: 33 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ

ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు. రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సినిమాలకు నిర్మాతగా, డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చిన జీవిత రాజశేఖర్ దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఈమె చివరిగా 1990లో మగాడు సినిమాలో కనిపించింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్న 170 వ చిత్రం ” లాల్ సలామ్” లో మంచి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సోదరి పాత్రకు జీవిత సైన్ చేసినట్లు తెలుస్తోంది. లాల్ సలామ్ చిత్రానికి రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్లపై నిర్మాత సభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. ఈ మూవీని క్రికెట్ నేపథ్యంలో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రజిని చెల్లెలి పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో జీవితని ఎంపిక చేశారట. కాగా మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు జీవిత. ఇది క్లిక్ అయితే మళ్లీ చకచగా సినిమాలలో జీవిత రాజశేఖర్ కనిపించే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు