Rashmika Mandanna: నేషనల్ క్రష్ డేరింగ్ డెసిషన్…. మైత్రీతో కటీఫ్?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆమె నటించిన కిర్రాక్ పార్టీ నుంచి వారసుడు వరకు ప్రతి సినిమాకు దేనికి అదే ప్రత్యేకం. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఆమె కెరీర్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అందుకే అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్‌గా, నేషనల్ క్రష్ అంటూ గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు, ఈ బ్యూటీ ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది. ఈమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒకటి అంటే ఒక్క కాంట్రవర్సీ కూడా లేదంటే అర్థం చేసుకొవచ్చు.. రష్మిక అందరితో ఎలాంటి రిలేషన్‌షిప్ మెంటేన్ చేస్తోందో.

అయితే తాజాగా ఓ బడా ప్రొడ్యూసర్స్ తో రష్మిక పడరాని పాట్లు పడుతుందట. ఆ బడా ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు… వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ స్థానానికి ఎదిగిన ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప సినిమా టైంలో రష్మిక, మైత్రీ మధ్య మంచి మైత్రీ ఉండేదట. ఈ సన్నిహిత్యంతోనే పుష్ప పార్ట్ 2 కాకుండా, మరో రెండు సినిమాల అగ్రిమెంట్‌కి రష్మిక సైన్ చేసిందట. కానీ, రెమ్యునరేషన్ తో పాటు ఇతర విషయాల్లో రష్మిక, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య చిన్నగా వివాదం స్టార్ట్ అయిందట. అది కాస్త చిలికి చిలికి గాలి వానలా తయారైందని తెలుస్తుంది.

దీంతో ముందుగా మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మిక చేసుకున్న అగ్రిమెంట్స్ ని క్యాన్సిల్ చేసుకుందని టాక్. అందువల్లే మైత్రీ వాళ్లు నిర్మిస్తున్న నితిన్, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీనితో పాటు రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చే మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మికనే అనుకున్నారట. కానీ, మైత్రీతో ముదురుతున్న వివాదం వల్ల దీని నుంచి కూడా తప్పుకుందట.

- Advertisement -

అంతే కాదు, పుష్ప2 ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అని రష్మిక వెయిట్ చేస్తుందని తెలుస్తుంది. పుష్ప2 రిలీజ్ అయిన వెంటనే మైత్రీతో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని, ఆ బ్యానర్ లో మళ్లీ సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయిపోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ తో గొడవ పెట్టుకుని, ఆ బ్యానర్ లో సినిమాలు చేయొద్దని రష్మిక డిసిషన్ తీసుకోవడం చాలా డేరింగ్ స్టెప్ అని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు