Mrunal Thakur: ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఈ సీక్రెట్స్ తప్పనిసరి..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకొని.. తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే మంచి పాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అందుకే కదా కథ కథనం బాగుంటే తప్ప పాత్రకు ఓకే చెప్పదు.. ఇక సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలి అంటే గ్లామర్ మెయింటైన్ చేయాల్సిందే అంటూ పలు విషయాలు వెల్లడించింది..నేచురల్ బ్యూటీ టిప్స్ ను తాను కూడా ఫాలో అవుతానని.. ముఖానికి పసుపు రాసుకుంటానని.. తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ చేసుకుంటానని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటానని.. ఇది ఒక కొరియన్ చిట్కా అంటూ తన బ్యూటీ సీక్రెట్స్ బయట పెట్టింది. 2023 సంవత్సరంలో కేన్స్ లో సందడి చేయడంతో తన కల తీరింది అని కూడా చెప్పుకొచ్చింది.

టీవీ నటులకు సినిమాలలో ఆఫర్లు రావడం అంత సులభం కాదు అని, అయితే ప్రతిభకు అదృష్టం కలిసొస్తేనే ఎక్కడైనా రాణించవచ్చని తెలిపింది. గతంలో మృణాల్ కూడా హిందీ సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఎన్ని సమస్యలు ఎదురైనా జీవితాన్ని సంతోషంగా గడపాలనే ఫిలాసఫీని తాను ఫాలో కావడం వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.. అంతేకాదు ప్రేక్షకులకు తాను గుర్తు లేకపోయినా తాను చేసిన పాత్రలు వాళ్ల మదిలో మెదిలితే చాలు అని.. రోజు పనికి వెళ్లాలని..అందులో తాను ఇష్టపడే పనిని చేయాలని భావిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ట్రెండ్ కి తగ్గట్టుగా ఫాలో అవుతానని లుక్స్ కి, ఈవెంట్స్ కి అనుగుణంగా కొత్త కొత్త ట్రెండ్స్ ట్రై చేయడంలో తనకు ఆసక్తి ఎక్కువ అని కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికైతే తన న్యాచురల్ బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు