గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా సర్కారు వారి పాట వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడతూ వచ్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా జరుగుతూ వచ్చింది. అన్ని హంగులు పూర్తి చేస్కుని వచ్చేనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్దంగా ఉంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ తో కావాల్సిన హైప్ క్రియేట్ అయింది. కళావతి, పెన్ని తో పాటు సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్స్ యూట్యుబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకున్నాయి. దీంతో సర్కారు వారి పాట పై భారీ అంచనాలు పెరిగాయి.
Read More: నష్టాల్లో ఆర్ఆర్ఆర్ తెలుగు బయ్యర్లు..!
ఎంత హైప్ వచ్చినా, మహేష్ చిత్రాలు ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతూ డిస్త్రిబ్యుటర్లకు, నిర్మాతలకు షాక్ లు ఇస్తూ ఉంటాయనేది కాదనలేని సత్యం. భారి అంచనాల మధ్య విడుదల అయిన బ్రహ్మోత్సవం, ఆగడు, మరి ముఖ్యంగా స్పైడర్ చిత్రాలే దీనికి నిదర్శనం. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది యు ఎస్ ఏ లో ఉన్న డిస్త్రిబ్యుటర్లు. భారి హైప్ కారణంగా కాస్త ఎక్కువ రేట్ల కే చిత్రాలను దక్కించుకుంటారు, కాని ప్రీమియర్స్ తర్వాత టాక్ బాగోలేదంటే, అక్కడున్న తెలుగువాళ్ళు కనీసం థియేటర్ మొహం కూడా చూడరు. దాంతో భారి నష్టాలను మూటగట్టుకుంటూ ఉంటారు.
సర్కారు వారి పాట కి కూడా అదే భయం పట్టుకుంది కాబోలు అక్కడున్న డిస్త్రిబ్యుటర్లకు. అందువల్లే, ప్రీమియర్స్ షో లతోనే బ్రేక్ ఈవెన్ ను సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా.. నష్టాల్లో ఉండకుండా ఒక రకమైన సేఫ్ గేమ్ ని ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read More: RT4GM: మరో గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న బేబమ్మ?
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...