బాల‌య్య‌కు ఆప‌రేష‌న్ నిజ‌మేనా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ అఖండ సినిమా సూప‌ర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. దీని త‌ర్వాత ఓ ప్ర‌ముఖ ఓటీటీలో ఆన్ స్టాప‌బుల్ షోతో హోస్ట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఔరా అనిపించాడు. ఇదే జోష్ తో గోపిచంద్ మాలినేని తో మూవీని కూడా స్టార్ట్ చేశాడు. దీనికి తోడు ఇటీవ‌ల రాజ‌కీయాల్లోనూ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇలా బిజీ బిజీ గా ఉన్న బాల‌య్య గురించి సోష‌ల్ మీడియాలో ఒక వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ నంద‌మూరి హీరో ఆస్ప‌త్రిలో చేరాడని.. ఆయ‌న మోకాలుకు ఆప‌రేష‌న్ కూడా అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ రోజు ఉద‌యం నుంచి దాదాపు ఎక్క‌డ చూసినా.. ఇదే వినిపిస్తోంది. ఆయ‌న ఆస్ప‌త్రిలో కాలుకు ప‌ట్టి క‌ట్టుకుని డాక్ట‌ర్స్ తో ఉన్న ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోతో బాల‌య్య‌కు ఆప‌రేష‌న్ అయింద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తుంది. బాల‌య్య ఫ్యాన్స్ కూడా.. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ వార్త‌ల‌ను బాల‌య్య అధికారిక వ‌ర్గాలు ఖండిస్తున్నాయి. ఆయ‌న రెగ్యూల‌ర్ చెక‌ప్ కోసమే హాస్పిట‌ల్ కు వెళ్లాడ‌ని చెబుతున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం సార‌ధి స్టూడియోస్ లో షూటింగ్ లో ఉన్నాడ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ డైల‌మోలో ప‌డ్డారు.

ఆయ‌న ఆస్ప‌త్రిలో ఉన్న‌ట్టు ఫోటోలు కూడా వైర‌ల్ అవుతున్నా.. షూటింగ్ అంటూ చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఏది నిజం అంటు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారంపై స్వ‌యంగా బాల‌కృష్ణే వ‌చ్చి ఈ వార్త‌లకు పుల్ స్టాప్ పెట్టాల‌ని నంద‌మూరి అభిమానులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు