కాజల్ ని కట్ చేసింది అందుకా??

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ల్టీ స్టార‌ర్ గా లేటెస్ట్ మూవీ ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ ఈ మూవీ పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ముగించుకుని ఈ నెల 29న విడుద‌ల అవ‌డానికి సిద్ధంగా ఉంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డే క‌నిపించ‌బోతుంది. ముంద‌గా రామ్ చ‌ర‌ణ్ ను ఈ మూవీలో డైరెక్ట‌ర్ గెస్ట్ రోల్ గానే అనుకున్నాడు. కానీ ఈ మూవీలో రామ్ పాత్ర న‌డివి దాదాపు 40 నుంచి 50 నిముషాల పాటు ఉంటుంద‌ని వినికిడి.

అయితే ఈ సినిమా నుంచి కాజ‌ల్ ను తొల‌గిస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్ ను ఈ మూవీలో మెగా స్టార్ కు జోడీగా అనుకున్నారు. కానీ చిరు న‌క్స‌లిజం సిద్ధంతాలు ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ల‌వ్ ట్రాక్ ఉండ‌టం స‌రి కాద‌ని డైరెక్ట‌ర్ అన్నారు. అందుకే కాజ‌ల్ పాత్ర‌ను పూర్తిగా క‌ట్ చేస్తున్న‌ట్టు కొర‌టాల తెలిపారు.

అయితే ఆచార్య నుంచి కాజ‌ల్ ను తొల‌గించ‌డానికి వేరే బ‌ల‌మైన కార‌ణం ఉందంటూ.. ఇప్పుడు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది కాపీ క‌థ అని.. కాపీ రైట్స్ స‌మ‌స్య రాకుండా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ కొర‌టాల తెలివిగా.. ఒక పాత్ర‌నే ఎత్తేశార‌ని ఆరోపణ‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -

తాజా గా ఆచార్య మూవీ స్టోరీ త‌న‌దంటూ.. ర‌చ‌యిత క‌న్నేగంటి అనిల్ కృష్ణ కాపీ రైట్ కేసు వేశాడు. ఒక్క పాత్ర మార్పు చేసి ఆచార్య‌ను విడుద‌ల చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. కాగ మోస్ట్ స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ స్టోరీ కాపీ చేశారా..? టాలీవుడ్ మెగా స్టార్ అలాంటి క‌థ‌ను అంగీక‌రించారా..? అంటూ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే విడుద‌లకు మూడు రోజులు స‌మ‌యం మాత్ర‌మే ఉన్న స‌మ‌యంలో ఈ కాపీ రైట్స్ వివాదం ఎక్క‌డి వ‌ర‌కు దారి తీస్తుందో.. చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు