మెగాస్టార్ కు జ‌గ‌న్ హెల్ప్..!

మెగా స్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జ‌గ‌న్ కు మ‌ధ్య ఉన్న సన్నిహిత్యం గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లుకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌రం లేదు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఎవ‌రికీ విన‌లేదు. మెగా స్టార్ మాత్ర‌మే.. జ‌గ‌న్ తో చ‌ర్చించి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ఈ చర్చ‌ల త‌ర్వాత చిరు-జ‌గ‌న్ మ‌ధ్య బంధం ఇంకా బ‌ల‌ప‌డింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సీఎం జ‌గ‌న్ ను ఆహ్వానించారు. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల సీఎం జ‌గ‌న్ ఈవెంట్ కు రాలేక‌పోయాడు.

ఇదిలా ఉండ‌గా.. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆచ‌ర్య సినిమా మ‌రో మూడు రోజుల్లో విడుద‌ల కానుంది. దీంతో నిన్న‌ తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ల ప్రైజ్ ల‌ను పెంచుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చింది. ఈ రోజు తాజా గా ఏపీ ప్ర‌భుత్వం కూడా ఆచార్య సినిమాకు థియేట‌ర్స్ లో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి వెసులుబాటు కల్పించింది. దీంతో ఏపీలో టికెట్ పై రూ. 50 పెరగనుంది.

అయితే ఏపీ ప్ర‌భుత్వం ఇటీవల విడుద‌ల చేసిన జీవో ప్ర‌కారం.. సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచాలంటే.. రూ. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయి ఉండాలి. అలాగే ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జ‌రిపితీరాలి. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ ఈ నిబంధ‌న‌లు చూపే టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఇక్క‌డ ఆచార్య రూ. 130 కోట్ల బ‌డ్జెట్ ఉన్నా.. ఏపీలో 20 శాతం షూటింగ్ మాత్రం జ‌రుపుకోలేదు. దీని ప్ర‌కారం టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవడానికి ఆచార్య‌కు అనుమ‌తి ఉండ‌దు.

- Advertisement -

కానీ ఆచార్య‌కు జ‌గ‌న్ ఈ అవ‌కాశాన్ని ఇచ్చారు. దీంతో చిరు-జ‌గ‌న్ మ‌ధ్య ఉన్న స్నేహం వ‌ల్లే ఆచార్య‌కు అనుమ‌తులు వ‌చ్చాయ‌ని, చిరంజీవికి సీఎం జ‌గ‌న్ సాయం చేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు