ఎలాంటి అంచనాలు లేకుండా.. వచ్చి భారత చలన చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్న సినిమా ది కశ్మీర్ ఫైల్స్. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి మెయిన్ రోల్స్ కనిపించారు. ఈ సినిమా మొదట మార్చి 11న కేవలం 630 థియేటర్స్ లోనే రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకుల డిమాండ్ మేరకు 4000కు పైగా.. స్క్రీన్స్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ లవర్స్ విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ ఏకంగా రూ. 338 కోట్లను వసూల్ చేసి సెన్సెషన్ క్రియేట్ చేసింది.
థియేటర్స్ లో దుమ్ములేపిన కశ్మీర్ ఫైల్స్.. ఓటీటీలో ఆడియన్స్ ను కనువిందు చేయడానికి వస్తుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై చిత్ర బృందం తాజా గా అఫీషియల్ అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 లో వచ్చే నెల 13వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపారు. జీ 5 కూడా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగ ఇప్పటికే థియేటర్స్ లో రచ్చ చేసి రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.