మళ్లీ మొదలైంది సినిమా తర్వాత టాలీవుడ్ హీరో సుమంత్ వరుస సినిమాలతో జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే కొత్త డైరెక్టర్ మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ కామెడీ యాక్షన్ మూవీలో సుమంత్ వాల్తేరు శ్రీను, విశాఖపట్నం రౌడీ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పుడు తాజా గా హీరో సుమంత్ మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.
డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్.. అహం రీబూట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ ఇంట్రెస్టెంగ్ గా ఉంది. సీరియస్ గా చూస్తూ.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని భయపెడుతున్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉండగా.. అహం రీబూట్ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు.