దేనికైనా రెడీ అంటున్న చి.ల.సౌ రుహాని

చిలసౌ, హిట్ ది ఫ‌స్ట్ కేస్, డ‌ర్టీ హ‌రి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర అయిన రుహాని శ‌ర్మ.. ఈ మ‌ధ్య కాలంలోనే శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌తో నూటొక్క జిల్లాల అంద‌గాడు సినిమా చేసింది. తెలుగులో నాలుగు సినిమాలు చేసిన ఈ సిమ్లా భామ‌.. క్రేజ్ ను మాత్రం పెద్ద‌గా సంపాదించ‌లేక పోయింది. విశ్వ‌క్ సేన్ కు మంచి గుర్తింపు తెచ్చిన‌ హిట్ ది ఫ‌స్ట్ కేసు మూవీలో రుహాని న‌టించినా.. పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీని త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చినా.. ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేక‌పోయింది.

అయితే రుహాని శ‌ర్మ‌కు హీరోయిన్ గా అవ‌కాశాలు పెద్ద‌గా.. రాక‌పోవ‌డంతో షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. హీరోయిన్ గానే కాకుండా.. విల‌న్, నెగెటివ్ రోల్స్ ల‌లో చేయ‌డానికి కూడా సిద్ధం అని రుహాని అనౌన్స్ చేసింద‌ట‌. దీనితో అయినా.. ఈ భామ‌కు అదృష్టం క‌లిసొస్తుందా..? చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు