Avika Gor: వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అవుతున్న సీరియల్ పిల్ల..!

టాలీవుడ్ లో ఉయ్యాలా జంపాల అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి పాపులరైన అవికా గోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతకంటే ముందే చిన్నారి పెళ్లికూతురు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమ్ సంపాదించిన ఈ అమ్మాయి టాలీవుడ్ లోనే ముందు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అవడంతో చిన్న సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్లాపులు పలకరించడంతో ఎంత స్పీడ్ గా సినిమాలు చేసిందో, అంతే స్పీడ్ గా ఆఫర్లు తగ్గిపోయాయి.

ఇక లాస్ట్ ఇయర్ నాగ చైతన్య థ్యాంక్ యూ లో చిన్న రోల్ లో నటించిన ఈ అమ్మాయి ఇప్పటివరకు టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే ఈ ఇయర్ మాత్రం అనుకోకుండా మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. అది కూడా అన్ని తెలుగు సినిమాలే కావడం విశేషం. రీసెంట్ గా హాట్ స్టార్ లో “వధువు” అనే వెబ్ సిరీస్ లో నటించిన అవికా గోర్ తాజాగా 2023 మొదట్లోనే పాప్ కార్న్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక హిందీలో 1920 హర్రర్ అఫ్ ది హార్ట్ అనే సినిమాలో కూడా నటించగా, తాజాగా తెలుగులో ‘ఉమాపతి’ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

దీంతో పాటు “అగ్లీ స్టోరీ” అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల ముందు వరకు ఒక్క సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూసిన ఈ సీరియల్ పిల్ల, ఇప్పుడు ఒక్క తెలుగులోనే నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని’ పెద్దలు చెప్పిన ఓ సామెతని అవికా గోర్ చక్కగా ఫాలో అవుతుందని చెప్పాలి. ఇక ఈ అమ్మాయి చిన్న హీరోల సినిమాలకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా మారిందని చెప్పాలి. మరి ముందు ముందు ఈ హీరోయిన్ ఇంకెంత పాపులర్ అవుతుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు