Teaser Talk: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘హిట్లర్’..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఈ ఇయర్ మూడు సినిమాలతో ఆడియన్స్ ని పలకరించాడు. అందులో రెండు సినిమాలు ప్లాప్ అవగా బిచ్చగాడు 2 హిట్ అయింది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు విజయ్. ఈ ఏడాదే నాలుగో సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నా విజయ్ ఆంటోనీ కూతురి ఆకస్మిక మరణం తో సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చాడు.

ఇక లేటెస్ట్ గా విజయ్ ఆంటోనీ మరో వైవిధ్యమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ధన అనే తమిళ్ డైరెక్టర్ దర్శకత్వంలో “హిట్లర్” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటుంది. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఆక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ని టీజర్ లో ఏమాత్రం రివీల్ చేయలేదు, కానీ చూపించిన విజువల్స్, టీజర్ కట్స్, దానికి తగ్గట్టు ఇచ్చిన బీజీఎమ్ ఆకట్టుకున్నాయి.

- Advertisement -

ఇక ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించగా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమా లో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా, గౌతమ్ మీనన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ రాజ్, కింగ్ స్లీ, వివేక్ ప్రసన్న, ఆడుగులం నరేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ మెర్విన్ త్రయం హిట్లర్ మూవీ కి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక విజయ్ ఆంటోనీ ఇంతకు ముందు కూడా పలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీల్లో నటించగా, ఈ సినిమాలో కాస్త కొత్తగా ట్రై చేస్తున్నాడని చెప్పొచ్చు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు