Ranveer singh: పెళ్లి తర్వాత మరీ రొమాంటిక్ గా అలియా? రణబీర్ ఒప్పుకుంటాడా?

అలియా భట్ పెళ్లి తర్వాత ఫుల్ జోష్ లో ఉంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా పెళ్ళయితే సినిమాలు మానేస్తారు. లేదా కనీసం గ్యాప్ అయినా ఇస్తారు. కానీ అలియా భట్ మాత్రం పెళ్ళై ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. గత సంవత్సరం నాలుగు సినిమాలతో సందడి చేసిన అలియా ఈ సంవత్సరం కూడా పలు సినిమాలతో రానుంది. అందులో కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని” ఒకటి. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.

ఫ్యామిలీ డ్రామాతో కూడిన లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ “రాణి ఛటర్జీ” గా కనిపించనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన స్టిల్స్ లో అలియా చిరకట్టులోనే కనిపించగా, రణవీర్ తో చాలా రొమాంటిక్ గా కనిపించింది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

ఈ సినిమాలో అలియా భట్ పలు రొమాంటిక్ సీన్లలో ఘాటుగా కనిపించనుందట. అంతేకాదు రణవీర్ తో కలిసి కొన్ని లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నాయని అంటున్నారు. లవ్ స్టోరీ సినిమా కావడంతో బాలీవుడ్ చిత్రాల్లో ఇవి కామనే అనుకున్నా, పెళ్లి తర్వాత అలియా ఇలాంటి సీన్లలో నటించడం తన కెరీర్ కి, ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ కి మంచిది కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

అయినా పెళ్లి తర్వాత రణబీర్ ఇలాంటి సీన్లకు ఒప్పుకున్నాడా? లేదా అనేది నెటిజన్ల భావన. ఎందుకంటే కొన్ని సార్లు అలియా భట్ పలు విషయాల్లో మొండిగా ఉంటుందని చాలా మందికి తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో రణబీర్ ఒప్పుకోకపోయినా అలియా నెక్స్ట్ స్టెప్ తీసుకుందని కొందరు నెటిజన్లు అంటుంటే, మరి కొందరు సినిమా వరకు ఇవి కామన్ కాబట్టి రణబీర్ ఓకే చెప్పాడని అంటున్నారు. మరి సినిమా విడుదలైతే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు