Pawan kalyan: “బ్రో” లో ఈ హీరోయిన్ నిజంగా ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన తాజా చిత్రం “బ్రో“. ఈ సినిమాని సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం రాబోతున్న పెద్ద సినిమాల్లో ఇదొకటి. పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మోషన్ పోస్టర్, టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రొమోషన్ల జోరును కూడా పెంచే ప్రయత్నం లో ఉంది. జులై ఫస్ట్ వీక్ లో ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే చాలా మంది ఫ్యాన్స్ కి ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఒక డౌట్ వస్తుంది. బ్రో సినిమాలో అసలు హీరోయిన్ ఉందా లేదా అని చాలా రోజుల నుండి కామన్ ఆడియన్స్ కి కూడా కంఫ్యూజన్ ఉండేది. పైగా ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో ఉన్నారని బజ్ క్రియేట్ అయింది. ఈ డౌట్ కి కారణం ఇప్పటి వరకు చిత్ర యూనిట్ హీరొయిన్ల ప్రస్తావన తీసుకు రాకపోవడమే అని చెప్పాలి.

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో ఒక చిన్న షాట్ లో ప్రియా వారియర్ కనిపిస్తుంది. దాంతో ఈ సినిమాలో ఒక హీరోయిన్ ఉందని కన్ఫర్మ్ అయింది. అయితే బ్రో లో కేతిక శర్మ కూడా ఉందని చాలా రోజుల నుండి టాక్ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ నుండి ఒక్క స్టిల్ కూడా రాలేదు. లీక్ కూడా కాలేదు. అలాగే మూవీ టీమ్ ఎప్పుడూ చెప్పలేదు. మరి కేతిక శర్మ బ్రో సినిమాలో అసలు ఉందా లేదా, ఉంటే ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు