RRR: ఆ హీరోయిన్ కోసం జక్కన్న గోడలు కూడా దూకాడట ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ… దర్శకుడు రాజమౌళి కి ఉన్న క్రేజ్ అంతా కాదు. మన జక్కన్న ఏం చేసినా అది సంచలనమే అవుతుంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఇప్పటివరకు అంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ వరకు ఆయన ఖాతాలో అన్ని హిట్లే ఉన్నాయి. ఇక త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ భారీ సినిమా చేస్తున్నాడు జక్కన్న. దీనికోసం ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టాడు రాజమౌళి.

ఇది ఇలా ఉండగా దర్శకుడు రాజమౌళి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజమౌళి… తన భార్య రమాను పెళ్లి చేసుకోక ముందు ఓ హీరోయిన్ ను ప్రేమించాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాడట జక్కన్న. కానీ ఆమెకు తన ప్రేమ గురించి చెప్పలేక అనేక ఇబ్బందులు పడ్డాడట రాజమౌళి. అలాగే ఆమెతో మాట్లాడేందుకు.. ఆ హీరోయిన్ ఇంటి గోడలు కూడా దూకాల్సి వచ్చిందట. అయినా తన ప్రేమ విఫలం కావడంతో…… తన భార్య రమాను పెళ్లి చేసుకున్నాడు రాజమౌళి.

కాగా రాజమౌళి భార్య రమా కు ఇదివరకే మొదటి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. భర్తతో గొడవ కారణంగా ఆమె విడిపోయింది. అప్పుడే మన జక్కన్న రమాను వివాహం చేసుకున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు