Mega Daughter:నిహారిక భర్త సన్యాసం తీసుకున్నాడా.. ఆ పోస్ట్ కి అర్థం ఇదేనా..?

ప్రముఖ సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలోనూ ఇలాంటి అనేక రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తలకు ఆధారాలు లేకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చైతన్య తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వల్ల వీరిద్దరూ నిజంగానే విడిపోయారనే వార్తలకు బలం చేకూరింది.

ఆ పోస్ట్ ఏంటంటే.. “ఈ స్థలం దగ్గరకు రావడానికి నన్ను నడిపించిన అందరికీ కృతజ్ఞతలు. గత పది రోజులుగా విపస్సానా యోగాను చేయడంతో నా జీవితం ఇప్పుడు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఒకరి జీవితంలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి తమకు తెలియని జ్ఞానంతో బయటకు వస్తానని నేను ఊహించలేదు. ఈ సమయంలో అండగా ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు” అంటూ రాసుకు వచ్చారు.

ఈ పోస్ట్ చూస్తుంటే ప్రస్తుతం చైతన్య బాధలో ఉన్నట్లు.. ఈ విపాసన యోగా చేయడంతో కాస్త సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైతన్యతో నిహారిక విడాకులు నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇదిలా ఉంటే.. నిహారిక మరోసారి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మంచి హిట్ అందుకున్న ఓ యంగ్ హీరో సరసన నటించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాబోతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు