Bhagavanth Kesari: శ్రీలీల కొత్త అవతారం… డ్యాన్స్, యాక్టింగ్ మాత్రమే కాదు. ఇక ఫైట్స్ కూడా ?

శ్రీలీల… ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని, చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్. సాధారణంగా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రావాలంటే, చాలా కష్టపడాలి. దానికి మించిన లక్ ఉండాలి. కానీ, శ్రీలీల కొన్ని సినిమాలకే స్టార్ హోదా వచ్చిందని చెప్పొచ్చు.

దానికి కారణం సందర్భాన్ని బట్టి ఆమె పలికే హావాభావాలు ఒకటి అయితే, మరొకటి ఆమె మాస్ డ్యాన్స్. హీరోయిన్లు అద్భుతంగా యాక్టింగ్ చేయడం కామన్. కానీ, శ్రీలీలలో ప్రత్యేకం యాక్టింగ్ తో పాటు డ్యాన్స్. శ్రీలీల అన్ని సినిమాల్లో తన డ్యాన్స్ ఫర్మామెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజతో వచ్చిన ధమాకా సినిమాలో శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

సినిమాలో ఈ యంగ్ బ్యూటీ డ్యాన్స్ కి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికే సూపర్ నేచురల్ యాక్టింగ్, మాస్ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీలీల తాజాగా మరో అవతారం ఎత్తడానికి రెడీ అయిపోతుందట. ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం దాదాపు 8 సినిమాలు చేస్తుంది. అందులో నందమూరి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి ఒకటి.

- Advertisement -

ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఇది ఇలా ఉండగా, భగవంత్ కేసరిలో శ్రీలీలతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం చేయిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఒక సందర్భంలో శ్రీలీలతో యాక్షన్ స్టంట్స్ వేయిస్తున్నాడట. ఆ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నాయని టాక్. దీనికి శ్రీలీల ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకుందని గుస గుసలు వినిపిస్తున్నాయి.

అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రం అంటే దాదాపు కామెడీ యాంగిల్ ఉంటుంది. దీంతో శ్రీలీల చేసే ఫైట్ కామెడీతో ఉంటుందా ? లేదా సీరియస్ సమయంలో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి విధితమే.

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Tollywood and Kollywood, Hollywood, and other film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు