BRO: థమన్‌కి ఏమైంది… మొన్న మహేష్ బాబు. నేడు పవన్ కళ్యాణ్ ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న వచ్చిందంటే, ఎలాంటి ఆలోచన లేకుండా ఎస్ ఎస్ థమన్ అని ఎవరైనా చెబుతారు. టాలీవుడ్‌లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా, వారి మ్యూజిక్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు. దీంతో అందరికీ ఫస్ట్ ఆప్షన్ థమన్ అవుతున్నాడు. అలా థమన్ ప్రస్తుతం ఏకంగా 12 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

ఒకే సారి 12 సినిమాలకు చేస్తున్నాడంటే, థమన్ మ్యూజిక్ పై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. థమన్ ఒకేసారి 12 సినిమాలకు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పనిభారం పెరగడం వల్ల సినిమాలకు సరైన సమయంలో ట్యూన్స్ ఇవ్వడం లేదట. దీంతో చిత్ర యూనిట్లు థమన్ పై ఫైర్ అవుతున్నాయి.

ఇటీవలే గుంటూరు కారం చిత్ర యూనిట్ థమన్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు పిలిచి మరీ థమన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడట. అంతే కాదు… గుంటూరు కారం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తొలగించారని టాక్ కూడా వచ్చింది. ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా థమన్ తన మ్యూజిక్ విషయంలో అదే ఆలస్యం అవుతుందట. తాజాగా థమన్ పై మరో సినిమా యూనిట్ కూడా ఆగ్రహంతో ఉందట.

- Advertisement -

అదే ఏదో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో మూవీ. ఈ చిత్రం రిలీజ్ ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. కానీ, ఇప్పటి వరకు థమన్ వర్క్ చాలా పెండింగ్ లో ఉందట. నిజానికి షూటింగ్ కూడా పెండింగ్ లో ఉంది. కానీ, మరికొన్ని రోజుల్లో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేస్తారు. కానీ, థమన్ వర్క్ మాత్రం ఇప్పట్లో పూర్తి కావడం కష్టమే అని అంటున్నారు.

ఇటీవల వచ్చిన టీజర్ కు కూడా మ్యూజిక్ చాలా ఆలస్యంగా ఇచ్చాడట. కేవలం ఒక్క రోజు ముందు టీజర్ కి మ్యూజిక్ వచ్చిందట. ఇప్పుడు బ్రో సినిమాకు థమన్ వర్క్ ఆలస్యం అయితే, సినిమా వాయిదా పడొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ థమన్ వర్క్ వల్లే బ్రో వాయిదా పడితే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి థమన్ బలికావాల్సిందే.

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News in Hollywood, Tollywood, Bollywood, Sandalwood, Hollywood, and other industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు