Krishna: తెరపై “అల్లూరి సీతారామరాజు”గా నటించి మెప్పించింది వీళ్ళే!

మన భారత దేశంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడి ప్రాణాలర్పించిన వీరుల్లో తెలుగువారి పేరు చెప్పుకుంటే అందులో ముందుగా చెప్పుకునేది “అల్లూరి సీతారామరాజు” గురించే. కొండ తెగకి చెందిన కోయ ప్రజల తో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఆ మహనీయుడి జయంతి (జులై4)నేడు. ఈ సందర్భంగా ఆ పోరాటయోధుడ్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లూరి సీతారామ రాజుగా నటించి మెప్పించిన కథానాయకులెవరో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ: అల్లూరి సీతారామరాజు(1974)

అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అల్లూరి సీతారామరాజు అంటే ముందు గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. అల్లూరి సీతారామరాజు బయోపిక్ గా 1974 లోనే వి. రామచంద్ర రావు దర్శకత్వం లో నటించాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించారు కృష్ణ. చాలా మంది ఈ బయోపిక్ తీస్తున్నప్పుడు కృష్ణ ని వద్దని వారించారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ తప్ప ఆ రోల్ ఎవ్వరు చేయరని అన్నారు. ఆరోజుల్లోనే ఈ సినిమా 2కోట్లకి పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీని తర్వాత కృష్ణ కి ఆ స్థాయి విజయం మళ్ళీ దక్కలేదు.

- Advertisement -

సీనియర్ ఎన్టీఆర్: మేజర్ చంద్రకాంత్(1993)

నందమూరి తారక రామారావు కూడా అల్లూరి వేషంలో మెప్పించారు. ఆయన నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఒక పాటలో ఒక నిమిషం పాటు అల్లూరి సీతారామరాజు గా కనిపించడం జరుగుతుంది. నిజానికి ఎన్టీఆర్ కూడా అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీద్దామనుకున్నారు. కానీ అంతలోనే కృష్ణ సినిమా తీయడంతో ఎన్టీఆర్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

మహేష్ బాబు: ముగ్గురు కొడుకులు(1988)

మహేష్ బాబు కూడా అల్లూరి సీతారామ రాజు గెటప్ లో కాసేపు కనిపించడం జరిగింది. కానీ చాలా మందికి తెలియదు. అయితే అది హీరోగా కాదు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాత సినిమా. మహేష్ బాబు తన తండ్రి కృష్ణ తో నటించిన ముగ్గురు కొడుకులు చిత్రంలో ఒక నాటకం వేసే సీన్ లో మహేష్ బాబు అల్లూరి సీతారామరాజు గా మెప్పించాడు. ఆ సీన్ లో గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పి ఔరా అనిపించాడు.

బాలకృష్ణ: (ఎన్టీఆర్ బయోపిక్2019)
నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ గా తీసిన కథానాయకుడు లో మేజర్ చంద్రకాంత్ లో అల్లూరి సీన్ ని రిపీట్ చేస్తూ బాలయ్య కాసేపు అల్లూరి సీతారామరాజు గా మెప్పించడం జరిగింది.

రామ్ చరణ్: (RRR 2022)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన RRR లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రకి ఫిక్షనల్ కథను జోడించి రాజమౌళి తెరక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మొదటి తరం లో అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ అనే ప్రేక్షకులు, ఈ జెనరేషన్ లో అల్లూరి సీతారామరాజు అంటే రామ్ చరణ్ అనే అంటున్నారు. అంతగా ఆ పాత్రలో నటించి మెప్పించాడు రామ్ చరణ్. అయినా “అల్లూరి సీతారామరాజు” పాత్ర చెయ్యాలంటే అంత ఆషామాషీ కాదు. ఆ పాత్ర యొక్క ప్రాధాన్యత అలాంటిది మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు