Shobhitha dhulipala: ఆమె కండిషన్స్ ను తట్టుకోలేక చైతూ కి దూరమైన శోభిత..!

Shobhitha dhulipala

టాలీవుడ్ లో యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత దాదాపుగా ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2017 అక్టోబర్ 6న పెద్దలను ఒప్పించి మరీ గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వైవాహిక బంధంలో నాలుగేళ్లపాటు సంతోషంగా ఉన్న ఈ జంట… 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. అప్పటినుంచి ఎవరి లైఫ్ లో వారు బిజీగా గడిపేస్తున్నారు. సమంత , నాగచైతన్య ఇద్దరూ కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు.

ఇకపోతే సమంత మాత్రం మయోసైటిస్ వ్యాధి కారణంగా ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నది. అందుకు తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు  సమంతతో నాగచైతన్య విడిపోయినప్పటి నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చైతన్య, శోభిత ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మీడియా కంట పడడంతో ఈ వార్తలకు నిజంచేకూరింది. దీంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

త్వరలో వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారనే వార్తలు కూడా వినిపించడం తో వీరు స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… నాగచైతన్య, శోభిత విడిపోవడానికి ముఖ్య కారణం నాగార్జున భార్య అన్నట్లుగా ఒక వార్త వైరల్ గా మారుతోంది.. నాగార్జున భార్య అమల చైతన్యకు భార్యగా రావాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే అంటూ చెప్పిందట. అంతేకాదు ఈ కండిషన్స్ ని పాటిస్తేనే వీరి బంధాన్ని పెళ్లి వరకు వెళ్ళనిస్తానని ముఖం మీద చెప్పేసిందట.

- Advertisement -

ఆ విషయం తెలుసుకున్న శోభిత.. ఆ కండిషన్స్ ఒప్పుకోలేక చైతన్య తో విడిపోయి ప్రస్తుతం ముంబైలో మరొక అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానుల సైతం అమలా తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే సమంత కూడా నాగచైతన్య నుండి విడాకులు కోరింది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు