Niharika: నిహారిక కొత్త పోస్ట్..ఆ పోస్ట్ కి అర్థం అదేనా..?

Niharika

మెగా డాటర్ నిహారిక ఒకప్పుడు హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకోకపోవడంతో నిర్మాతగా మారి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ దిశగా దోసుకుపోతోంది. ఇకపోతే ఈమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితంలో వచ్చే రూమర్లతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఆ ఫోటోలతో పాటు పెట్టిన ఒక కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ జాయింట్ లైఫ్ ని వదులుకొని సింగిల్ గా ఉంటోంది నిహారిక. రీసెంట్గా విడాకులు, సెకండ్ మ్యారేజ్ పై కూడా హాట్ కామెంట్స్ చేసిన ఈ అమ్మడు తాజాగా ఫోటోతో పాటు ఇది చాలా ఆనందకరమైన రోజు అంటూ కామెంట్ చేసింది..

కలంకారి డిజైన్ చీర ధరించి.. సిగ్గుపడుతూ తల కిందకు దించుకున్న ఫోటోలు షేర్ చేయడం చూస్తుంటే సెకండ్ మ్యారేజ్ కి సంబంధించి న్యూస్ ఏమైనా చెప్పబోతోందా అంటూ నెటిజన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇక అసలు విషయం ఏమిటంటే.. నిహారిక రీసెంట్గా షేర్ చేసిన ఈ కలర్ ఫుల్ సారీతో దిగిన ఫోటోలలో తన బావ హీరో వైష్ణవ్ తేజ్ ను హత్తుకుని దిగిన ఫోటో కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనితో బావ మరదలు సంక్రాంతి పండుగకు దిగిన ఫోటోని వేరేలా అర్థం చేసుకుంటున్నారు నెటిజన్స్.. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Niharika Konidela shared a photo of herself hugging brother-in-law hero Vaishnav Tej

- Advertisement -

నిహారిక విషయానికి వస్తే.. మూడేళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన సంబంధం గా చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న ఈమె.. పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకుంది.. ఇక వీరి విడాకులపై అనేక కథనాలు, రూమర్లు వినిపించగా తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ.. విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని అయితే పరిస్థితుల ప్రభావం వ్యక్తులను నమ్మడం వల్ల ఇదంతా జరిగిందంటూ చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలలో ఒకటైన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఈమె విడాకుల వార్త కూడా సోషల్ మీడియాలో అంతే హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఫోకస్ అంతా సెల్ఫ్ కేర్ పైనే పెట్టానని చెప్పడం చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటుందేమో అంటూ నెటిజన్ లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎవరితో పంచుకుంటుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు