Regina: రెజీనా “ఉత్సవం” ఉత్సాహాన్నిచ్చేనా..?

Regina cassandra

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్ఎంఎస్ (శృతి మనసులో శివ ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రెజీనా కసాండ్రా. తక్కువ సమయంలోనే చిన్న హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న ఈమె స్టార్ హీరోల సినిమాలలో కూడా అడపాదడపా నటిస్తూ సినీ కెరియర్‌ను నెట్టుకొస్తోంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గడంతో వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఈమె కెరియర్ అయిపోయింది అంటూ అందరూ కామెంట్లు చేస్తుండగా తాజాగా “ఉత్సవం” అనే సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ. దిలీప్ ప్రకాష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది.

తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం టీజర్ ని విడుదల చేయగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తోందని చెప్పవచ్చు. నాటక రంగం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.. ముఖ్యంగా ఇందులో రెజీనా పాత్ర రెగ్యులర్ గానే ఉన్నప్పటికీ కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రెజీనాకు ఇది తెలుగులో కచ్చితంగా చివరి అవకాశం అన్నట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలే తెలుగులో ఫేడౌట్ అవుతున్న ఈ హీరోయిన్… చివరిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది..

ఇలాంటి సమయంలో ఈ సినిమా కూడా బెడిసి కొడితే ఆమెకి తెలుగులో అవకాశాలు పూర్తిగా ఖతం అయినట్లే అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఈ ఆఫర్ ని రెజీనా సద్వినియోగం చేసుకొని అదృష్టం కొద్ది సక్సెస్ అవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి అందరూ అనుకున్నట్లుగానే ఈ చిన్న సినిమాలో ఆమె సక్సెస్ అందుకుందంటే ఖచ్చితంగా ఆమె మళ్లీ టాలీవుడ్ లో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. లేకపోతే తెలుగు దర్శక నిర్మాతలు ఈమె వైపు కన్నెత్తి కూడా చూడరని చెప్పవచ్చు. మరి రెజీనా ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇక రెజీనా విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లో చేస్తున్న ఈమె కొన్ని వెబ్ సిరీస్లను నేరుగా ఓటీటీ లోకి విడుదల చేస్తూ సక్సెస్ అందుకునే దిశగా ప్రయాణిస్తుంది. మరి ఈ ఉత్సవం సినిమా రెజీనాకు ఏ విధంగా ఉత్సాహాన్ని ఇస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు