Tollywood : టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్ కలకలం… పట్టుబడ్డ హీరో గర్ల్ ఫ్రెండ్

Tollywood

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో యంగ్ హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ తో పోలీసులకు పట్టు పడడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసు ఆమె ద్వారా మళ్ళీ టాలీవుడ్ కే లింకు కావడం గమనార్హం.

సోమవారం హైదరాబాదులోని నార్సింగ్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో సైబరాబాద్ స్పెషల్ టీం జరిపిన ఈ ఆపరేషన్ లో ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పేరు లావణ్య అని, ఆమె టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని సమాచారం. లావణ్య దగ్గర నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ అమ్మాయి ప్రియుడైన ఆ టాలీవుడ్ హీరో ఎవరు అన్న విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసుల విచారణలో ఎండిఎంఏ డ్రగ్స్ ని గోవా నుంచి తీసుకొచ్చినట్టు వెళ్లడైంది. ఈ నేపథ్యంలోనే లావణ్య పై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక సదరు యువతి మ్యూజిక్ టీచర్ గా పని చేస్తోందని, అరెస్ట్ అనంతరం ఆమెను ఉపర్ పల్లి కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించిందని పోలీసులు వెల్లడించారు. రిమాండ్ లో భాగంగా లావణ్యను ప్రస్తుతం చంచల్ గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

అయితే కొంతకాలం క్రితం ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఆ లింక్ టాలీవుడ్ కే వచ్చి చేరేది. అదే క్రమంలో కొన్నాళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో పూరి జగన్నాథ్, రవితేజ, రానా, చార్మి, తరుణ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత పలు విచారణ అనంతరం ఈ కేసు చల్లబడింది. కానీ తాజాగా మరోసారి లావణ్య ద్వారా మళ్లీ టాలీవుడ్ కే డ్రగ్స్ కేసు లింక్ అవ్వడం కలకలం రేపుతోంది. మరి ఈ కేసు రాజ్ తరుణ్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? మళ్లీ ఈ కేసులో ఎవరెవరి పేర్లు బయట పడతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజానికి రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో వరుసగా ప్లాఫ్ లో అందుకోవడంతో టాలీవుడ్ లో హీరోగా ఆయన కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “నా సామి రంగ” మూవీ హిట్ కావడంతో మరోసారి కం బ్యాక్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే చేశాడు. అయినప్పటికీ ఈ మూవీ ఇచ్చిన జోష్ తో తన నెక్స్ట్ సినిమాలపై నమ్మకంతో ఉన్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఆయన చేతిలో “తిరగబడరా సామి”, “భలే ఉన్నాడే” అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు