Sreeja: బాబాయ్ బాటలో శ్రీజ.. మూడో పెళ్లికి సిద్ధం..నిజమేనా..?

Sreeja

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ విడాకుల వ్యవహారం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. మొదట కుటుంబ సభ్యులను ఎదిరించి భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమె.. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దలు కుదిర్చిన వివాహాన్ని.. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న కళ్యాణ్ దేవ్ తో ఏడు అడుగులు వేసింది శ్రీజ.. ఇక మీరు పెళ్లి బంధానికి గుర్తుగా ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ వెంటనే మళ్ళీ భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో శ్రీజ రెండవ భర్తకు కూడా విడాకులు ఇవ్వడంతో ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు మెగా కుటుంబాన్ని చాలామంది ట్రోల్ చేశారు.

అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపించని శ్రీజ ఇప్పుడు మళ్లీ నిర్మాతగా పలు సినిమాలతో యాక్టివ్ గా మారింది. తాజాగా శ్రీజ తన పెళ్లి విడాకుల పైన కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీజ మాట్లాడుతూ… రెండో పెళ్లి తర్వాత తను చాలా మారిపోయానని చెప్పుకొచ్చింది. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవాలి.. వాళ్ళు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు కదా.. అంతే ప్రేమగా అస్సలు చూడరు అంటూ తెలిపింది.

నాన్న చిరంజీవికి నేను అంటే చాలా ఇష్టం.. కళ్యాణ్ దేవత విడాకులు అయిన తర్వాత నా ఇద్దరు అమ్మాయిలతో ఒంటరిగానే జీవిస్తున్నాను.. ఎవరిమీద ఆధారపడకుండా ఉండడం నేర్చుకున్నాను.. నిజానికి నా రెండో పెళ్లి పెద్దలు కుదిరిచిన వివాహం.. నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది పలు రకాల మాటలు అన్నారు.. నన్ను , నా కుటుంబాన్ని సైతం బ్లేమ్ చేశారు. అది చాలా బాధగా అనిపించింది.. ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని ఏడ్చాను.. మానసికంగా బాధపడ్డాను అంటూ తెలిపింది శ్రీజ.

- Advertisement -

మొత్తానికి శ్రీజ కూడా పర్సనల్ లైఫ్ లోని సమస్యల వల్ల చాలా బాధపడినట్లుగా తెలుస్తోంది.. ఇక మూడో పెళ్లి విషయంలో రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఆమె ఈ విషయం పైన మాట్లాడలేదు.. కానీ గతంలో మాత్రం ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటానంటూ ఆ మధ్య కామెంట్స్ చేసినట్లుగా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. దీంతో శ్రీజ మళ్లీ పెళ్లి చేసుకుంటే బాబాయి పవన్ కళ్యాణ్ బాటలోనే నడవబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..మరి శ్రీజ మూడో పెళ్లి ఎవరిని చేసుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు