Pushpa 2 : “పుష్ప”రాజ్ క్రేజీ లుక్ లీక్… లెక్కల మాస్టారు లెక్క ఎక్కడ తప్పుతుంది?

Pushpa 2

2024లో మూవీ లవర్స్ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “పుష్ప 2” ఒకటి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి “పుష్ప”రాజ్ క్రేజీ లుక్ లీక్ అయ్యింది. అల్లు అర్జున్ చీర కట్టుకుని కూర్చున్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “పుష్ప : ది రూల్”. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో బిగ్గెస్ట్ హైప్ ఉన్న మూవీగా “పుష్ప” టాప్ ప్లేస్ లో ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన “పుష్ప” మూవీకి సౌత్ నుంచి నార్త్ దాకా అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. “పుష్ప 2″లో కూడా అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రెండవ భాగానికి కూడా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు.

ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సాధారణంగానే స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లీకులతో లీకు రాయుళ్లు చేసే రచ్చ మేకర్స్ కు తలనొప్పిగా మారుతూ ఉంటుంది. “పుష్ప 2” విషయంలోనూ అదే జరుగుతోంది. తాజాగా “పుష్ప 2” షూటింగ్ సెట్స్ నుంచి పిక్ లీక్ కావడం అల్లు అర్జున్ అభిమానుల్లో గందరగోళాన్ని క్రియేట్ చేస్తోంది.

- Advertisement -

“పుష్ప 2” మేకర్స్ కొంతకాలం క్రితం విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ బీభత్సమైన అవతారంలో కనిపించి సినిమాపై అంచనాలను పెంచేశాడు. అదే క్రమంలో ఈ మూవీలో జాతరకు సంబంధించి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, దానికోసం భారీ సెట్టు వేశారని వార్తలు వచ్చాయి. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఓ భారీ సాంగ్ ఉంటుందని, మొదటి భాగంలో “ఊ అంటావా” అనే పాపులర్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆ పాటకు అల్లు అర్జున్ తో అదిరిపోయే స్టెప్పులు వేయించనున్నాడని సమాచారం.

ఆ తర్వాత జాతర యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ చీర కట్టుకుని కనిపిస్తాడని ప్రచారం జరిగింది. ఇక తాజాగా లీకైన పిక్ లో అల్లు అర్జున్ చీర కట్టుకుని కూర్చుని కనిపిస్తున్నాడు. ఇలా మంచి హైప్ ఉన్న సీక్వెన్స్ కు సంబంధించిన పిక్స్, మూవీ రిలీజ్ కి కొన్ని రోజుల ముందే ఇలా లీక్ అవ్వడం అనేది సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తుంది. మరి లెక్కల మాస్టర్ లెక్క ఈ లీకుల విషయంలో ఎక్కడ తప్పుతుందో. మేకర్స్ ఈ లీకు రాయుళ్లపై ప్రత్యేకమైన దృష్టి పెడితే మంచిది అంటున్నారు బన్నీ ఫాన్స్.

icon star allu arjun look leaked from pushpa 2

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు