Telugu Comedian: మనం రోజూ వాడే GPRS కనిపెట్టింది ఆ కమెడియన్ కొడుకులేనా..?

Telugu Comedian

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు హాస్యనటుడిగా పేరు దక్కించుకొని.. లెజెండ్రీ కమెడియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజబాబు అందరికీ సుపరిచితులే.. తన అద్భుతమైన మాటలతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన రాజబాబు గా మనకు పరిచయం కానీ ఈయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.. 1935 అక్టోబర్ 20 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు.. ఇంటర్ వరకు చదివి ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నాటకాలలో అవకాశం రావడంతో “కుక్కపిల్ల దొరికిందా, నాలుగిళ్ళ చావిడి, అల్లూరి సీతారామరాజు” వంటి నాటకాలు వేశారు.

అలా నటిస్తున్న సమయంలోనే 1960లో సమాజం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ 1962లో వచ్చిన భీష్మ సినిమాతోనే ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే పరమానందయ్య శిష్యులు సినిమాలో ఆయన చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. రాజబాబు హాస్యనటుడు గానే కాకుండా హీరోగా కూడా ఒక సినిమాలో నటించారు.. “మనిషి రోడ్డున పడ్డాడు” అనే సినిమాలో రాజబాబు హీరోగా నటించి అందరిని మెప్పించారు. ఇలా నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన ఏకంగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులను దక్కించుకున్న మొదటి హాస్య నటుడిగా కూడా పేరు గాంచారు.

1980 వరకు సినిమాలో నటించిన ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం తో 1980 ఫిబ్రవరి 7వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణించినా కానీ ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఆయనను అభిమానిస్తారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే రాజబాబు 1965 డిసెంబర్ 5న లక్ష్మీ అమ్ములు ను వివాహం చేసుకోగా వీరికి మహేష్ బాబు, నాగేంద్రబాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు. అందరిలాగే ఈయన కూడా తన వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అనుకున్నారు.. కానీ ఆయన మాత్రం సినిమా ఇండస్ట్రీ వైపు తన కొడుకులను తీసుకురాకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి.

- Advertisement -

రాజబాబు మరణించిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అమెరికాకు వెళ్లిపోయి అక్కడే చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివి అక్కడే.. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా నడుపుతున్నారు. అలాగే ఇండియాలో కోట్ల విలువ చేసే ఆస్తులను కూడ పెట్టారు.. అంతేకాదు ప్రస్తుతం మనం ప్రతిరోజు వాడుతున్న GPRS సిస్టం కూడా వారు తయారు చేసిందే. అమెరికాలో వారి కంపెనీ తరఫున రోజుకి ఐదు గంటలు అక్కడ పోలీసులు పనిచేస్తారు. ఇక అమెరికాలో కోట్లాధిపతులలో రాజబాబు కొడుకులు కూడా ఉండడం విశేషమని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు