Vikrant Rona : కిచ్చా సుదీప్ రికార్డ్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలియని వారు ఉండరు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా సుదీప్ అలరించాడు. తాజాగా విక్రాంత్ రోనా అనే సినిమాతో వచ్చాడు. బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండజ్, నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహించారు. అత్యంత భారీ అంచనాల మధ్య జులై 28న పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. విక్రాంత్ రోనా ఈ సినిమాకు కేజీఎఫ్ స్థాయిలో టాక్ అయితే రాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం తెలుగులో కూడా బాగున్నాయి.

సరైన సినిమా పడితే థియేటర్స్ జనం వస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ వీకెండ్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ పూర్తి నెగటివ్ టాక్ తో మొదలైంది. దీంతో జనాలు విక్రాంత్ రోనా వైపు మొగ్గుచూపుతన్నారు. ఈ నేపథ్యంలో ‘విక్రాంత్ రోనా’ సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ వసూలు రాబడుతుంది. అంతే కాకుండా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది.

ఆదివారం 29 కోట్లు వసూల్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 115 నుంచి 120 కోట్లు వసూళ్లు రాబట్టనున్నట్టు సమాచారం. అలాగే నైజాం ఏరియాలో అతి తక్కువగా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు అందుకుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత తక్కువ కాలంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా విక్రాంత్ రోనా రికార్డు నమోదు చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు