Bobby : “ఎనర్జీతో చేస్తున్నా”

మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ బ్రాండ్. ఎలాంటి సినిమాలు చేసినా, ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు చిరంజీవి. అలాగే డైరెక్టర్ బాబి దర్శకత్వంలోనూ చిరు ఓ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఆచార్య మూవీ ప్రమోషన్లలోనూ చిరు ఈ విషయాన్ని లీక్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇందులో మాస్ మహారాజా రవితేజ సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా సోమవారం దర్శకుడు బాబి పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. వీటికి స్పందిస్తూనే మెగా 154పై కీలక వ్యాఖ్యలు చేశాడు. మెగా 154 సినిమా కోసం మొత్తం ఎనర్జీ, ఎఫర్ట్స్ పెడతాను అంటూ ప్రామిస్ చేశారు. పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన విషెస్ తనలో మరింత బలాన్ని నింపాయని తెలిపారు. కాగా, మెగా 154 వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు