Ashwini: ఆ స్టార్ హీరో పై మోజు పడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!

ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ప్రముఖ నటి అశ్విని. హౌస్ లో ప్రతి ఒక్క టాస్క్ లో పాల్గొని ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. తన అందచందాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తనను పక్కన పెడుతున్నారు అంటూ కన్నీరు పెట్టుకొని సింపతి కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో భారీ పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని.. తన మనసులో ఆ స్టార్ హీరోకి ఎప్పటికీ స్థానం చెరిగిపోదు అంటూ కామెంట్లు చేసింది.

ఇక ఎవరా హీరో అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అశ్విని మాట్లాడుతూ.. ” నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చి.. ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ ఫ్రెండ్ గా నేను నటించాను.. పవన్ తో దాదాపు మూడు నెలల పాటు జర్నీ చేశాను.. షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నన్ను కూర్చోబెట్టుకొని మరీ మాట్లాడేవారు.. నాతో డాన్స్ లు చేయించేవారు. మేము చాలా సరదాగా ఉండేవాళ్ళము .. షూటింగ్లో అశ్విని కమాన్ అని నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు.. అంతేకాదు ఆయనకి ఎప్పుడైనా బోర్ కొట్టినా నన్నే పిలిచేవారు.ఇక ఇద్దరం కలిసి క్యారీ వ్యాన్ లో ఉండే వాళ్ళం.. అయితే ఇప్పుడు ఆయన నన్ను మర్చిపోయి ఉంటారు కానీ ఎప్పుడూ నేను మాత్రం మర్చిపోను ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ నావాడే అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా మారిన ఈయన ఓజీ , హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లను ప్రస్తుతం నిలిపివేసినట్లు తెలుస్తోంది. రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన మరింత బిజీగా మారినట్లు సమాచారం. అందుకే సినిమాలను కూడా పక్కనపెట్టి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎలక్షన్స్ ముగిసే వరకు మళ్లీ సినిమా షూటింగ్లకు హాజరు కారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గురించి అశ్విని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు