Gangs of Godavari Release : నిర్మాతకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్… విశ్వక్ సినిమాకు రిలీజ్ కష్టాలు

Gangs of Godavari Release : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. వీరంతా కూడా ఇదివరకే పాపులర్ అయిన బ్యానర్స్ నుంచి అనుసంధానంగా కొత్త బ్యానర్స్ స్థాపించి, దాని ద్వారా సినిమాలు తీయటం మొదలుపెట్టారు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతలలో ఒకప్పుడు దిల్ రాజు, అశ్విని దత్, సురేష్ బాబు, చినబాబు వంటి పేర్లు వినిపించేవి. ప్రస్తుతం వీళ్ళు కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ వీళ్ళు కేవలం స్టార్ హీరోస్ తో మాత్రమే సినిమాలు తీస్తున్నారు. వీటికి అనుసంధానంగా ఉన్న కొన్ని బ్యానర్స్ మిడ్ రేంజ్ హీరోలతో సినిమా తీస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ కి అనుసంధానంగా స్వప్న సినిమాస్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో ఎవడే సుబ్రమణ్యం, మహానటి,జాతి రత్నాలు,సీతారామం వంటి అద్భుతమైన హిట్ సినిమాలు తీసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ కొంత పేరును సంపాదించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ ఒక కొత్త బ్యానర్ను స్థాపించి దాంట్లో కూడా బలగం అనే సినిమాతో హిట్ సాధించారు.

- Advertisement -

ఇకపోతే జులాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్. అయితే ఈ బ్యానర్ లో ఇప్పటివరకు త్రివిక్రమ్ మినహా ఇంకో దర్శకుడు సినిమాను చేయలేదు. ఇది త్రివిక్రమ్ కి హోం బ్యానర్ అయిపోయింది. దీనికి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను నిర్మించారు చిన్నబాబు. అయితే ఈ బ్యానర్ లో నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా నాగ వంశీ డీల్ చేస్తూ ఉంటారు. ఈ బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని సాధించాయి.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇకపోతే దీని మెయిన్ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ లో సంక్రాంతి కానుక రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా ఊహించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. కొంతమేరకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కూడా కలిగింది అంటూ వార్తలు వినిపించాయి.

దానికి అనుబంధంగా ఉన్న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో టిల్లు స్క్వేర్ హిట్ అవ్వడం అనేది కొంత వరకు కలిసి వచ్చింది. ఇకపోతే ఇదే బ్యానర్ నుంచి గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా రానుంది. టిల్లు స్వ్కేర్ సినిమా రిలీజ్ కు నాగ వంశీ కొంతమేరకు చాలా కష్టాలు పడ్డారు అని కథనాలు వినిపించాయి. ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ ( Gangs of Godavari Release )కు కూడా అదే కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు