Vidaamuyarchi Update : రియల్ హీరో… రిస్కీ స్టంట్స్ చేస్తున్న అజిత్

Vidaamuyarchi Update : సినిమాలలో యాక్షన్ సన్నివేశాల కోసం సాధారణంగా మేకర్స్ హీరోల బాడీ డబుల్స్ ను వాడుకుంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రమే సినిమా మీద ఉన్న ప్యాషన్ తో డూప్ తో పని లేకుండా సొంతంగా స్టంట్స్ చేస్తూ రిస్క్ తీసుకుంటారు. అలాంటి స్టార్ హీరోల లిస్టులో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కూడా ఉంటారు. సాధారణంగానే బైక్ రైడింగ్, కార్ రేసింగ్ అంటే అమితంగా ఇష్టపడే అజిత్ తన సినిమాల్లో కూడా బైక్ రైడింగ్, యాక్షన్ సీన్లను ఆయనే చేస్తారు. తాజాగా ఆయన చేస్తున్న ఓ సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అవ్వగా, ఆయన కారు యాక్సిడెంట్ కు గురైన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే అజిత్ కు ఏం కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

యాక్షన్ సీక్వెన్స్ లో ప్రమాదం…

ప్రస్తుతం అజిత్ “విదా ముయార్చి” అనే తమిళ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్నారు. అజిత్ కు ఇది 62వ సినిమా కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. “విదా ముయార్చి” మూవీకి మగిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ విజయ్, ఆర్య, ఉదయనిది స్టాలిన్ వంటి హీరోలు ఈ మూవీలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా సినిమా కోసం అజిత్ చేసిన రిస్కీ స్టంట్ కు సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. ఈ మూవీ షూటింగ్ అజర్ బైజాన్ లో జరుగుతుండగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా అజిత్ సొంతంగా వెహికల్ డ్రైవ్ చేశారు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారు యాక్సిడెంట్ కు గురవ్వడం ఆ వీడియోలో కన్పిస్తోంది. డూప్ లేకుండానే అజిత్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లో నటించడంతో ఆయనకు చిన్నపాటి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. గత ఏడాది నవంబర్లో షూటింగ్ జరిగినప్పుడు తీసిన వీడియో. మొత్తానికి అజిత్ చేసిన రిస్కీ స్టంట్ చూసి ఆయనకు సినిమా మీద ఉన్న డెడికేషన్, కమిట్మెంట్ అలాంటిది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

ఇది కొత్తేమీ కాదు…

అజిత్ కు రిస్కీ స్టంట్స్ చేయడం అనేది కొత్తేమీ కాదు. గతంలో కొన్ని సినిమాల్లో కూడా స్వయంగా ఆయనే పలు యాక్షన్స్ సన్నివేశాల్లో నటించి మెప్పించారు. తెలుగులో గ్యాంబ్లర్ పేరుతో రిలీజ్ అయిన మంకత్త అనే సినిమాలో కూడా రిస్కీ బైక్ స్టంట్ చేసి అజిత్ ఆకట్టుకున్నారు. అందుకే అజిత్ కుమార్ ను అభిమానులు రియల్ హీరో అని కూడా పిలుస్తూ ఉంటారు. తాజాగా మరోసారి “విదా ముయార్చి” కోసం ఆయన చేసిన రిస్క్ ను చూసాక ఆ మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరోవైపు బైక్ పై ప్రపంచాన్ని చుడుతూ తన డ్రీంను నెరవేర్చుకుంటున్నారు అజిత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు