Tillu Square First Review : “టిల్లు స్క్వేర్” ఫస్ట్ రివ్యూ

Tillu Square First Review : ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న “టిల్లు స్క్వేర్” మూవీపై హైప్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ మార్చి 29న థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది. ఇప్పటికే “టిల్లు స్క్వేర్”పై భారీగా అంచనాలు ఉండడంతో ప్రమోషన్ల పరంగా పెద్దగా హడావిడి చేయకుండా, సైలెంట్ గా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. కానీ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, అందులో అను లుక్స్, సిద్దుతో చేసిన రొమాన్స్ కారణంగా ఊహించిన దానికంటే ఈ సినిమాపై ఎక్కువగానే బజ్ క్రియేట్ అయ్యింది. కాగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “టిల్లు స్క్వేర్” మూవీనీ స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా కొంతమంది సినీ పెద్దలకు చూపించారట మేకర్స్. దీంతో ఈ సినిమా ఎలా ఉందనే టాక్ మొదలైపోయింది. మరి ఇంతకీ టిల్లు స్క్వేర్ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవుతుందా? సినిమాను చూసిన సినీ పెద్దల టాక్ ఏంటి? అంటే…

టిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ…

సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. టిల్లు స్క్వేర్ టైటిల్ తో తాజాగా థియేటర్లలోకి రాబోతున్న సీక్వెల్ పలుమార్లు వాయిదా పడి, ఎట్టకేలకు మార్చి 29న రిలీజ్ కాబోతోంది. ఇక డీజే టిల్లు మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, సీక్వెల్ “టిల్లు స్క్వేర్”లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. రామ్ మల్లిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు. తాజాగా టిల్లు స్క్వేర్ స్పెషల్ స్క్రీనింగ్ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మరి ఇంతకీ టిల్లు స్క్వేర్ ఎలా ఉంది? అంటే… యావరేజ్ ఫస్ట్ హాఫ్, బోరింగ్ సెకండ్ హాఫ్ తో ఈసారి టిల్లు నిరాశపరచాడని అంటున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్ సీన్స్ తో నిండిపోయినట్టు తెలుస్తోంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం నేహా శెట్టి మెరిసే 15 నిమిషాల ఎపిసోడ్ మాత్రం బాగుందని టాక్ నడుస్తోంది. మొత్తంగా ఈ సినిమా బిలో యావరేజ్ అని అంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసిన ఈ మూవీకి ఫస్ట్ రివ్యూ ఊహించని విధంగా రావడంతో టిల్లు అభిమానులు అప్పుడే డీలా పడిపోతున్నారు. కానీ టిల్లు స్క్వేర్ థియేటర్లోకి వచ్చిన తర్వాత, ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నదే ఇంపార్టెంట్. మరి ప్రేక్షకులు “టిల్లు స్క్వేర్”కు సినీ ప్రియులు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే మార్చ్ 29 దాకా వెయిట్ అండ్ సి. ఈ మూవీకి ఎక్స్పెక్టెడ్ రేటింగ్ : 2-2.5.

అందుకే సెన్సార్ రిపోర్ట్ ఇలా ఉందా?

టిల్లు స్క్వేర్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందులో అనుపమ, సిద్దు రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ మూవీలో అనుపమ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ గా కనిపించబోతుందని డిస్కషన్ నడిచింది. కానీ తీరా చూస్తే సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు U/A సర్టిఫికెట్ రావడం కొత్త అనుమానాలను రేకెత్తించింది. నిజానికి ఈ మూవీకి A సర్టిఫికెట్ వస్తుందని అందరూ అంచనా వేశారు. ట్రైలర్లో ఆ రేంజ్ లో రొమాన్స్ ఉంది మరి. అయితే U/A సర్టిఫికెట్ వచ్చిందంటే సినిమాలో అంతగా ఎక్స్పెక్ట్ చేసిన రొమాంటిక్ సీన్లు లేవా? జస్ట్ ట్రైలర్లో ప్రేక్షకులను ఊరించడానికే అలా చూపించారా అనే అనుమానం ఇప్పటికే చాలామందికి ఉంది. ఇప్పుడేమో ఫస్ట్ రివ్యూ కూడా దీనికి తగ్గట్టుగానే వచ్చింది. మరి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సినిమా లేకపోతే ముఖ్యంగా అనుపమ అభిమానులు హర్ట్ అయ్యే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు