Weight Loss : డైట్, వర్కవుట్లు చేసినా ఫలితం లేదా? అయితే ఇదే కారణం

Weight Loss : ప్రస్తుత తరం యూత్ ను ఎక్కువగా వేధిస్తున్న సమస్య బరువు తగ్గడం. వెయిట్ లాస్ కోసం వాళ్లు చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పొచ్చు. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనే ఉద్దేశంతో డైట్ ఫాలో అవ్వడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమందిలో మాత్రం ఫలితం కనిపించదు. బరువు పగడం పక్కన పెడితే అసలు ఏ మార్పు కనిపించదు. వెయిట్ అలాగే కంటిన్యూ అవుతుంది లేదా మరింతగా పెరిగిపోతారు. అలాంటి సమయంలోనే ఎంత ట్రై చేసినా సరే బరువు మాత్రం ఎందుకు తగ్గట్లేదు అనే ప్రశ్న వాళ్ళ మనసును తొలిచేస్తుంది. అయితే ఎంత కష్టపడినప్పటికీ బరువు తగ్గకపోవడం వెనక కొన్ని కారణాలు ఉంటాయి. మరి ఇంతకీ వెయిట్ లాస్ కాకపోవడానికి కారణం ఏంటి? అనే విషయంలోకి వెళ్తే….

ఈ అనారోగ్య సమస్యలు ఉంటే వెయిట్ లాస్ కష్టమే…

గత కొన్నేళ్లు గా వెయిట్ లాస్ (Weight Loss) గురించి జనాలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడడమే అందుకు కారణం. బరువును కంట్రోల్ లో ఉంచుకోకపోతే శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఊబకాయం వల్ల డయాబెటిస్, హైబిపి లాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఇక ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడంపై చాలామంది దృష్టి పెడుతున్నారు. కానీ ఎంత ట్రై చేసినా బరువు మాత్రం తగ్గట్లేదు అంటే… దానికి కొన్ని అనారోగ్య సమస్యలే కారణమవుతాయి. సరైన డైట్ ఫాలో అవ్వడం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నిద్రలేమి వంటివి వర్కౌట్ చేసినా, డైట్ ఫాలో అయినా కూడా బరువు తగ్గకపోవడానికి కారణాలు అవుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, కేలరీలను సరిగ్గా తీసుకోకపోతే బరువు తగ్గడం కష్టసాధ్యమే. సరిగ్గా నిద్ర పోకపోయినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా అవన్నీ మనసుపై చూపించే ఎఫెక్ట్ కారణంగా బరువు తగ్గడం కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1. ప్రోటీన్ అనేది కండరాల రిపేర్, మెటబాలిజం బూస్టింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

- Advertisement -

2. అంతేకాకుండా తక్కువ క్యాలరీలతో ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు కోల్పోతారు. కానీ దానివల్ల నీరసంగా ఉంటుంది. కాబట్టి సరైన సంఖ్యలో క్యాలరీలు ఉండేలా చూసుకోండి.

3. హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది. ఒకవేళ ఈ సమస్య ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

4. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడి దూరమై బరువు తగ్గుతారు. ఒత్తిడి పెరిగితే హార్మోన్ల సమస్య మొదలవుతుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.

5. యోగ, ధ్యానం వంటి వ్యాయామాల ద్వారా మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవచ్చు. కాబట్టి క్యాలరీలు సరిగ్గా ఉండేలా డైట్ మెయింటైన్ చేస్తూ, హాయిగా నిద్ర పోవడం, ఆరోగ్యకరమైన ఫుడ్ తో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజు చేయడం వల్ల బరువు తగ్గుతారు. లేదంటే డాక్టర్లను సంప్రదించడం మంచిది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు