Lifestyle : వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది? ఉదయమా, సాయంత్రమా?

Lifestyle : రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే శారీరకంగా ఆరోగ్యంగా, చురుగ్గా, ఫిట్ గా ఉంటామని విషయం అందరికీ తెలుసు. అయితే మానసికంగా కూడా హెల్దీగా ఉండడానికి ఎక్సర్సైజులు ఉపయోగపడతాయి. మరి వ్యాయామం ఏ టైంలో చేస్తే మంచిది? ఉదయం చేయాలా? లేకపోతే సాయంత్రం చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయా? అనే అనుమానం తరచుగా వస్తూ ఉంటుంది కొంతమందికి. అయితే ఉదయం వ్యాయామం చేస్తే బెటర్ అని కొంతమంది చెప్తే, మరి కొంత మంది మాత్రం సాయంత్రం చేస్తేనే ఉత్తమమని నమ్ముతారు. అయితే నిజానికి బిజీ లైఫ్ కారణంగా ప్రతిరోజు ఒకే సమయంలో ఎక్సర్సైజులు చేయలేకపోవచ్చు. మరి ఏ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం వ్యాయామం చేస్తే ఏం ప్రయోజనాలు… ఎక్సర్సైజ్ చేసే టైం అనేది మీ రొటీన్, లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది. అయితే ఉదయాన్నే వ్యాయామం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయంలోకి వెళ్తే… రెగ్యులర్ గా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ బలపడుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి. ఖాళీ కడుపుతో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. బరువు తగ్గడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో రోజంతా మానసికంగా, శారీరకంగా ఫ్రెష్ గా, చురుగ్గా ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో అనేక రకాల హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ కారణంగానే రోజంతా సంతోషంగా, ఫ్రెష్ గా ఉండగలుగుతారు. ఇక ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నాయి. ఉదయం పూట ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేని వారు త్వరగా అలసిపోతారు. వ్యాయామాలు చేసేటప్పుడు కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కండరాలు, బోన్స్ కదలికలు కొంతమందికి కష్టం అవుతాయి.

సాయంత్రం ఎక్ససైజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే… సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. కొంతమంది ఉదయం కంటే సాయంత్రం వేళల్లోనే ఎక్కువ యాక్టివ్ గా వ్యాయామాలు చేయగలుగుతారు. అలాంటివారు ఉదయం కంటే సాయంత్రం ఎక్సర్సైజులు చేయడం బెటర్. సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేయడం వల్ల అలసటను దూరం చేసుకోవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాత్రి పూట బాగా నిద్ర పడుతుంది. రిలాక్స్డ్ గా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రెష్ గా స్టార్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఎవరికి కన్వినెంట్ గా ఉండే సమయాల్లో వారు వ్యాయామం చేసుకోవడం బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు