Captain Miller Movie Review Telugu: కెప్టన్ మిల్లర్ మూవీ తెలుగు రివ్యూ

Critic’s Rating
2.25
About the movie
సంక్రాంతికే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సిన ‘కెప్టెన్ మిల్లర్’ థియేటర్లు దొరక్క జనవరి 26 కి పోస్ట్ పోన్ అయ్యింది. ‘సార్’ సినిమాతో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్ నటించిన సినిమా కావడం, అలాగే సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ వంటి హీరోలు అతిధి పాత్రలు చేయడం వంటివి ‘కెప్టెన్ మిల్లర్’ పై తెలుగు ప్రేక్షకుల దృష్టి పడేలా చేశాయి. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి…

కథ:

1930ల కాలంలో బ్రిటీష్ వారు ఇండియన్స్ ని రూల్ చేస్తున్న టైం అది. ఆ టైంలో కేవలం తన ఊరి పై, అలాగే ఆ ఊరి జనాల పై ఉన్న కోపంతో అగ్నీశ్వర (ధనుష్) బ్రిటీష్ వారి సైన్యంలో చేరతాడు. అక్కడ అతనికి మిల్లర్ అని పేరు పెడతారు. ట్రైనింగ్ పూర్తయ్యాక తన డ్యూటీలో భాగంగా 300 మంది భారతీయుల్ని చంపాలని పై అధికారి ఆదేశిస్తాడు. అది ఎంత మాత్రం ఇష్టం లేని అగ్నీశ్వర… అయిష్టంగానే కొంతమంది భారతీయుల చావుకి కారణం అవుతాడు. అది తలుచుకుని అతను, తన స్నేహితుడు బాధపడుతూ ఉండగా.. బ్రిటీష్ అధికారి అగ్నీశ్వర స్నేహితుడిని చంపేస్తాడు. దీంతో అగ్నీశ్వర… తన స్నేహితుడిని చంపిన అధికారిని చంపేస్తాడు.

- Advertisement -

ఇది చూసిన అగ్నీశ్వర మరో స్నేహితుడు రఫీక్ (సందీప్ కిషన్) .. ఎక్కడికైనా పారిపొమ్మని అక్కడి నుండి అతన్ని తప్పిస్తాడు. ఆ తర్వాత అగ్నీశ్వర మిల్లర్ దొంగగా మారి బ్రిటీష్ వారికి టార్గెట్ అవుతాడు. మరోపక్క అగ్నీశ్వర సొంత ఊర్లో జనాలని.. ఆ ఊరి పెద్దలు పీడిస్తూ ఉంటారు. వాళ్ళని అంటరానివారుగా చూస్తూ గుడిలోకి కూడా రానివ్వరు. వారి కష్టాలు తెలుసుకున్న అగ్నీశ్వర అలియాస్ కెప్టెన్ మిల్లర్.. ఏం చేశాడు? అసలు అగ్నీశ్వర కుటుంబం ఏమైంది? అతనికి తన ఊరిపై ఎందుకు కోపం? అగ్నీశ్వరకి శివన్నకి సంబంధం ఏంటి? భానుమతి (ప్రియాంక అరుల్ మోహన్) తో అగ్నీశ్వరకి ఎలా పరిచయం ఏర్పడింది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు అరుణ్ మతీశ్వరన్.. పొన్నియన్ సెల్వన్.. ల మాదిరి చాలా పాత్రలతో ఈ కథని డిజైన్ చేశాడు. కానీ అంతలా కన్ఫ్యూజ్ చేసింది లేదు. అందరికీ అర్ధమయ్యేలా ఎపిసోడ్స్ లా విడగొట్టి కథని చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే బ్రిటీష్ వాళ్ళు పాలించే టైంలో మిషన్ గన్లు వంటివి పెట్టి చాలా లిబర్టీస్ కూడా తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించినా హీరో గతాన్ని వివరించిన తీరు బాగుంది. అలాగే క్లైమాక్స్ లో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కామియోలు మంచి హై ఇస్తాయి.

మరీ ‘జైలర్’లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్.. ల రేంజ్లో ఎలివేట్ చేయకపోయినా.. ఇందులో కూడా ఈ కామియోలు వర్కౌట్ అయ్యాయి. అలా అని ఇది ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా అనలేం. టార్గెటెడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కాకపోతే మితిమీరిన యాక్షన్ ఎపిసోడ్స్ కథకి అడ్డం తగిలిన ఫీలింగ్ కలుగుతుంది.

విజువల్స్ బాగానే ఉన్నా.. అక్కడక్క కెమెరా ఊగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ సాంకేతిక లోపల ఎత్తిపెట్టి చూపేలా అనిపిస్తాయి. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో బాగుంది అనిపిస్తుంది. కానీ, పాటలు అయితే ఏమాత్రం చెవికి ఎక్కేలా ఉండవు. నిర్మాత గట్టిగానే ఖర్చుపెట్టాడు అని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. ధనుష్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. మూడు రకాల లుక్స్ లో అతను చూపించిన వైవిధ్యమైన నటన అన్ మ్యాచబుల్ అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. అతని తర్వాత హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కి ఎక్కువ మార్కులు పడతాయి. కెరీర్లో మళ్ళీ ఇలాంటి పాత్ర ఆమెకి దొరికే ఛాన్స్ లేదు. అందుకేనేమో చాలా మనసు పెట్టి చేసింది. ఇక సందీప్ కిషన్ కూడా చాలా బాగా చేశాడు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.

ప్లస్ పాయింట్స్ :

ధనుష్
క్లైమాక్స్
సందీప్ కిషన్, శివన్న కామియోలు

మైనస్ పాయింట్స్ :

మితిమీరిన యాక్షన్ డోస్

ఫస్ట్ హాఫ్

మొత్తంగా.. ఈ ‘కెప్టెన్ మిల్లర్’ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులు ‘సార్’ లాంటి సినిమా చూసి ఇంకేదో ఆశించి ఈ సినిమాకి వెళ్తే నిరాశే ఎదురవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు