Squid Game 2 on OTT : మోస్ట్ అవెయిటింగ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Squid Game 2 on OTT : ప్రపంచవ్యాప్తంగా సస్పెన్స్ మూవీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ రెండో సీజన్ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కానీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎప్పుడు తెరపైకి రాబోతోంది అనే విషయాన్ని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. దీంతో ఈ విషయం గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎప్పుడు, ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది? అంటే…

అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు

ఇటీవల కాలంలో కొరియన్ వెబ్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక అందులో భాగమైన స్క్విడ్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది డిస్టోపియన్ డ్రామా 2021లో సూపర్ సక్సెస్ అయ్యి నెట్ ఫ్లిక్స్ ఓటిటి రికార్డును బ్రేక్ చేసింది. గ్లోబల్ గా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్ గా హిస్టరీని క్రియేట్ చేసిన స్క్విడ్ గేమ్ సీజన్ 2 గురించి ఈ సిరీస్ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ను 2024 లోనే స్ట్రీమింగ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటిదాకా దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం స్క్విడ్ గేమ్ సీజన్ 2 2024 ద్వితీయార్థంలో స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. కామిక్ బుక్ రిపోర్టు ప్రకారం జూలై నుంచి అక్టోబర్ మధ్య ఎప్పుడైనా సీజన్ 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఏ నెలలో ఈ సిరీస్ రాబోతోంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -

స్క్విడ్ గేమ్ 2 లాస్ట్ అప్డేట్ ఇదే

స్క్విడ్ గేమ్ సీజన్ 2 కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రెండు నెలల క్రితమే రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేసి క్యూరియాసిటీని మరింతగా పెంచేశారు. వీ హాజూన్, లీ జంగ్ జయీ, లీ బ్యుంగ్ హన్, జంగ్ యూ, ఇమ్ సివాన్ లతో పాటు మరికొంత మంది కొత్త యాక్టర్లు కూడా ఈ రెండవ సీజన్ లో కనిపించబోతున్నారు.

ఫస్ట్ పార్ట్ స్టోరీ

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ 2021 సెప్టెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. 9 ఎపిసోడ్ లో ఉన్న ఈ కొరియన్ డ్రామా నరాలు తెగే సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బు కోసం 450 మంది ఈ గేమ్ ఆడటానికి ముందుకు రాగా, ఒక్కొక్కరిగా చిన్న చిన్న గేమ్స్ లో ఎలిమినేట్ అయ్యి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. చావో రేవో తేల్చుకోవడమే ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్. సస్పెన్స్, ఎమోషన్స్ తో సాగిన స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా చరిత్రను క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు