I’m not a Robot on OTT : మరికొన్ని గంటల్లో ఓటిటిలోకి కోటీశ్వరుడికి రొమాన్స్ నేర్పించే మసాలా స్టోరీ… సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే చూడండి

I’m not a Robot on OTT : ఇటీవల కాలంలో ఓటీటీకి ఆదరణ పెరగగా, అందులోనూ కొరియన్ మూవీస్ అంటే పడి చచ్చిపోతున్నారు మూవీ లవర్స్. ఇక రొమాంటిక్ మూవీస్ అయితే అంతకుమించి అన్నట్టుగా ఉంటుంది ఆడియన్స్ రెస్పాన్స్. మంచి మసాలా సినిమాలను ఇష్టపడే వారి కోసం మరికొన్ని గంటల్లోనే ఐయాం నాట్ ఏ రోబో అనే కొరియన్ వెబ్ సిరీస్ తెలుగులో రాబోతోంది. ఈటీవీ విన్ లో ఏప్రిల్ 25 నుంచి ఈ సిరీస్ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈటీవీ విన్. రిలీజ్ డేట్ ను చాట్ చేస్తున్నట్టుగా ఉన్న స్క్రీన్ షాట్స్ తో, కొత్త పోస్టర్ తో డిఫరెంట్ గా వెల్లడించారు.

ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులోకి…

ఈ కొరియన్ వెబ్ సిరీస్ 2017 లో రిలీజ్ అయింది. ఐఎండిబిలో రేటింగ్ 8 తెచ్చుకున్న ఐయాం నాట్ ఏ రోబో వెబ్ సిరీస్ మొత్తం 32 ఎపిసోడ్ లతో ఏడాది పాటు స్ట్రీమింగ్ అయ్యింది. ఇక కొరియాలోనే అత్యధిక మంది వీక్షించిన సిరీస్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఇదంతా ఇందులో ఉన్న బోల్డ్ కంటెంట్ మహిమే. ఇన్నేళ్ల తర్వాత అంటే దాదాపు 8 ఏళ్ల అనంతరం ఐయాం నాట్ ఏ రోబోట్ సిరీస్ తెలుగులోకి వస్తుండడంతో ఉత్కంఠత నెలకొంది.

త్వరలోనే సీక్వెల్ కూడా..

ఐయాం నాట్ ఏ రోబో సిరిస్ సీజన్ 2 కూడా రాబోతుందనే విషయాన్ని ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ సిరీస్ డైరెక్టర్ జంగ్ డే యూన్ ఫస్ట్ సీజన్ లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉందని, కానీ సెకండ్ సీజన్లో మాత్రం బోల్డ్ కంటెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని అనౌన్స్ చేశారు.

- Advertisement -

రోబోతో శృంగారం…

జంగ్ డే యున్ దర్శకత్వం వహించిన ఐయాం నాట్ ఏ రోబో వెబ్ సిరీస్ లో యుక్ సీయింగ్ హో, చే సు బిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇందులో హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాన్స్, బోల్డ్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి. కాబట్టి పొరపాటున కూడా ఫ్యామిలీతో కలిసి చూసే ధైర్యం చేయకండి.

ఇక స్టోరీ విషయానికి వస్తే…

మల్టీ మిలియనీర్ బిజినెస్ మాన్ కు హ్యూమన్ ఎలర్జీ ఉంటుంది. అందుకే అమ్మాయిల జోలికి వెళ్లకుండా రోబోతో ప్రేమ పాఠాలు మొదలుపెడతాడు. కానీ రోబో పేరుతో తన లైఫ్ లోకి ఓ అమ్మాయి ఎలా వచ్చింది? చివరికి ఆ విషయం తెలుసుకున్న కోటీశ్వరుడు ఏం చేశాడు? అనేదే స్టోరీ. వినడానికి సింపుల్ గా ఉన్న మంచి మసాలా కంటెంట్ మాత్రం ఉంటుంది ఈ వెబ్ సిరీస్ లో. కాబట్టి ఒంటరిగానే చూడండి.

ఎమ్ఐ 3 తెలుగులో…

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ భాషల్లో ఎమ్ఐ 3 పేరుతో రీమేక్ చేశారు. హన్సిక లీడ్ రోల్ చేసిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాగా పెద్దగా ఆకట్టుకోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు