Faria Abdullah: టాటూ వెనుక అసలు రహస్యం ఇదే..!

Faria Abdullah.. జాతి రత్నాలు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా ప్రభాస్ కి తగ్గ హైట్ తో అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.. ఇక ఈమె పక్కన నటించాలంటే ప్రభాస్, మహేష్ లాంటి హీరోలే సరితూగుతారు అని ఆడియన్స్ కూడా కామెంట్లు చేశారు.. నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఊహించని కలెక్షన్లను కూడా రాబట్టి రికార్డు సృష్టించింది.. అటు నిర్మాతగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి మంచి పేరు కూడా లభించింది. ఇక జాతి రత్నాలు సినిమా తర్వాత బంగార్రాజు సినిమా లో ఐటమ్ సాంగ్ లో మెరిసింది.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయనుకున్నారు.. కానీ ఈమె హైట్ కి తగ్గ జోడి కుదరక అవకాశాలు కూడా కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ .. దీంతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డాన్స్ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ..

Faria Abdullah:This is the real secret behind the tattoo..!
Faria Abdullah:This is the real secret behind the tattoo..!

ట్రెండ్ ను ఫాలో అవుతున్న సెలబ్రిటీలు..

ఇకపోతే ఈమధ్య కాలంలో టాటూ ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. చాలామంది వేల రూపాయలు ఖర్చుపెట్టి మరీ ఇష్టమైన టాటూలు వేయించుకుంటున్నారు.. అయితే ఇలా ట్రెండుకి కేరాఫ్ అడ్రస్ గా మారేది ఎవరు అంటే సెలబ్రిటీలనే చెప్పాలి.. దీంతో సెలబ్రిటీలు వేయించుకునే టాటూలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.. ఇకపోతే కొంతమంది చేతులకు, వేళ్ళకు, నడుము ఇలా కనిపించే భాగాలలో టాటూలు వేయించుకుంటే.. మరికొంతమంది కనిపించని భాగాలలో కూడా టాటూలు వేయించుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది శరీరం మొత్తం టాటూలు వేయించుకుంటూ అబ్బుర పరుస్తున్నారు.. ఇకపోతే సెలబ్రిటీలకు సంబంధించిన టాటూ ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది .. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా టాటూ పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సెలబ్రిటీలు తాము వేసుకునే టాటూల వెనుక ఎన్నో కారణాలు, అర్థాలు చెబుతూ ఉంటారు..

టాటూ పై క్లారిటీ..

ఈ క్రమంలోనే హీరోయిన్ ఫరియా తన కాలుకు వేసుకున్న టాటూ వెనుక కూడా ఒక అర్థం ఉందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె రివీల్ చేసింది.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన కాలిపై ఉన్న టాటూ వేర్లను సూచిస్తోంది.. “వేర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంత ఎత్తుకు ఎదగలం.. మనం ఎంత స్థాయిలో ఉన్నా నేలని మరువకూడదు” అనే విషయాన్ని ఈ టాటూ తనకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.. అదే దీని అర్థం అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి అయితే కుడి కాలు మీద పాదానికి కొద్దిగా పైభాగాన ఈమె వేయించుకున్న టాటూ.. దాని వెనుక అర్థం తెలిసి అందరూ ఈమెను మెచ్చుకుంటున్నారు.. ఎవరైనా సరే ఎంత కోటీశ్వరులైనా సరే రూపాయి విలువ తెలుసుకోవాలని.. అప్పుడే ఆ స్థానానికి అర్థం ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. పునాది స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది.. ఇక దీనికి అర్థం కూడా ఇదే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు