Highway Trailer : క్రైమ్ థ్రిల్లర్ లో కొత్తగా..

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆనంద్ దేవరకొండ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా హైవే సినిమా వస్తుంది. ఈ సినిమాను 118 దర్శకుడు కెవి గుహన్ తెరకెక్కిస్తున్నాడు. నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు మేకర్స్.

ఈ మూవీ ట్రైలర్ ను హీరో నాగశౌర్య విడుదల చేశారు. గత కొంతకాలంగా హీరో ఆనంద్ దేవరకొండ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తూ కొత్త తరహా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే లేటెస్ట్ గా సైకో క్రైమ్ థ్రిల్లర్ కథతో హైవే మూవీని చేశారు. ఇందులో విభిన్నమైన పాత్రలో నటించాడు. అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ అత్యంత కిరాతకంగా మర్డర్ చేసే ఓ సైకో కిల్లర్ చుట్టూ సాగే స్టోరీ ఇది.

‘వరుస హత్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్’ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ ‘మీరేం భయపడక్కర్లేదు, రిలాక్స్ గా ఉండండి’. ‘ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి సార్’ అంటూ చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

‘సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టైల్, ఇది వాడి సిగ్నేచర్’ అంటూ పోలీసులు చెప్పే డైలాగ్స్ ప్రకారం.. సీరియల్ కల్లర్ చేసే మర్డర్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అర్థమవుతుంది. డైలాగ్స్, ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సైకో కిల్లర్ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ ట్రైలర్ తో హైవే సినిమా సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు