Karthikeya 2 : మూడు రోజుల్లోనే..

మంచి హిట్ లేక టాలీవుడ్ అల్లాడుతున్న సమయంలో ఆగస్టు నెల ఊరటను ఇచ్చింది. ఆగస్టు నెల ప్రారంభంలో వచ్చిన సీతారామం, బింబిసార మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీటి తర్వాత రెండు సినిమాలు వచ్చాయి. కానీ, అవి బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ నిరాశలోకి వెళ్తున్న సమయంలో వచ్చింది కార్తికేయ-2. యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ఈ సినిమాను చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా ఈ నెల 13న పాన్ ఇండియా రేంజ్ లో తక్కువ థియేటర్ లలోనే రిలీజ్ అయింది. కానీ, పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకు షోల సంఖ్య, థియేటర్ ల సంఖ్య పెంచుకుంటూ వెళ్తుంది. బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే, తాజా గా ఈ సినిమా ఓ రికార్డు నమోదు చేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 15.44 కోట్ల షేర్ ను 26.50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో 11.54 కోట్ల షేర్‌, 17.80 కోట్ల గ్రాస్‌ ను కలెక్ట్ చేసింది. తొలి రోజు 3.50 కోట్లు, రెండో రోజు 3.81 కోట్లు, మూడో 4.23 కోట్లు సాధించింది. ఇలా రోజు రోజుకు కలెక్షన్లు పెరగడం కార్తికేయ-2కు కలిసొచ్చే అంశం. దీనికి తోడు ఆగస్టు 25 వరకు వచ్చే సినిమాలు లేవు. వచ్చే వీకెండ్ తో పాటు కృష్టాష్టమి సందర్భంగా 18, 19 తేదీల్లో సెలవులు ఉన్నాయి. దీంతో కార్తికేయ-2 కు సాలిడ్ వసూళ్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు.

- Advertisement -

కార్తికేయ2 మూడు రోజుల్లో కలెక్షన్లు ఇలా ఉన్నాయి…

నైజాం : 4.06 కోట్లు

సీడెడ్ : 1.83 కోట్లు

ఉత్త‌రాంధ్ర : 1.51 కోట్లు

గుంటూరు : 1.14 కోట్లు

ఈస్ట్ : 99లక్షలు

వెస్ట్ : 73 లక్షలు

కృష్ణా : 87 లక్షలు

నెల్లూరు : 41 లక్షలు

కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా : 70 లక్షలు

నార్త్‌ ఇండియా : 60లక్షలు

ఓవర్సీస్‌ : 2.60 కోట్లు

మొత్తంగా 15.44 కోట్ల షేర్.. 26.50 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు