వాహ్ రాహుల్

రాహుల్ రామకృష్ణ
ఇది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.
పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేసిన “సైనమా” అనే షార్ట్ ఫిలిం ద్వారానే చాలామంది దృష్టిని ఆకర్షించాడు రాహుల్ రామ కృష్ణ.
ఎవరికీ తెలియని ఇంకో టాలెంట్ ఏంటి అంటే రాహుల్ రామకృష్ణ పాటలు కూడా రాస్తాడు. విజయ్ దేవరకొండ చేసిన “పెళ్లి చూపులు” సినిమా లోని ఈ బాబుగారికి అనే పాటను రాసింది రాహులే.
రాహుల్ పుస్తకాలు గట్టిగా చదువుతాడు, బాత్రూం లో కూర్చుని పుస్తకాలు చదవటం ఆయనకు అలవాటు.

పుస్తకాలను ఎక్కువగా చదివేవాళ్లకి సమాజం పట్ల కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది. కొన్ని పరిణామాలను వాళ్ళు చూసే దృక్కోణం, కొన్ని విషయాలపై వాళ్ళు స్పందించే విధానం మిగతావాళ్లకంటే వేరుగా ఉంటుంది. ఈ మధ్య హీరో విశ్వక్‌ సేన్‌- ఓ టీవీ యాంకర్‌ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో కొందరు ఆ యాంకర్‌కు సపోర్ట్‌ చేస్తుండగా, ఎక్కువశాతం విశ్వక్‌సేన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

రీసెంట్ గా రాహుల్‌ రామకృష్ణ విశ్వక్‌సేన్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సదరు టీవీ ఛానెల్‌ను వరుస ట్వీట్స్‌తో ఏకిపారేశాడు.

- Advertisement -

‘ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్‌ ఫీట్‌లో నేను కూడా భాగమవుదామనుకుంటున్నా.విశ్వక్‌సేన్‌ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్‌ కేవలం డబ్బుల కోసమే న్యూస్‌ కవర్‌ చేస్తుంది. నీచమైన రూపంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది..

ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది. సదరు ఛానెల్‌ న్యూస్‌ తప్పా మిగతావన్నీ కవర్‌ చేస్తారని, వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్‌ వస్తాయంటూ సంచలన కామెంట్స్‌ చేశాడు. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూపై సదరు ఛానెల్‌ వాళ్లు పిలిస్తే లైవ్‌ డిబెట్‌లో పాల్గొంటా’ అంటూ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం రాహుల్‌ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు