ప్రేక్ష‌కులు ” ఇష్ట” ప‌డతారా..?

రామ్ గోపాల్ వర్మ.. త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌పై రుద్ద‌డం అయ‌న ప‌ని. ఆయ‌న చేసిన సినిమాలు చెత్త అనే వాళ్లు… ఉన్నారు. అలాగే మెసెజ్ ఇచ్చే మూవీస్ అనే వారు.. ఉన్నారు. వ‌ర్మ చేసిన చేసిన ప‌లు మంచి హిట్స్ కూడా అందుకున్నాయి. ఆయ‌న కాకుండా.. ఆయ‌న శిష్యులు కూడా ఇండ‌స్ట్రీలో డైరెక్ట‌ర్స్ గా ఎదిగి బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ గా మా ఇష్టం మూవీ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా లెస్బియన్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు వ‌ర్మ‌. ఈ మూవీలో అప్స‌ర రాణీ, నైనా గంగూలీ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇద్దరమ్మాయిల మ‌ధ్య ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో అభ్యంత‌ర‌కర స‌న్నివేశాలు ఉన్నాయ‌ని ప‌లువురు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అలాగే నిర్మాత న‌ట్టి కుమార్ కూడా ఓ కేసు కూడా వేశాడు.

దీంతో ఈ మూవీ విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మా ఇష్టం ఈ నెల 6న థియేట‌ర్స్ ల‌లో రిలీజ్ కానుంది. అయితే ఈ లెస్బియ‌న్ మూవీ.. రామ్ గోపాల్ వ‌ర్మ గ‌త సినిమాల్ల బోర్ కొట్టిస్తుందా.. లేదా ప్రేక్ష‌కులు ఇష్ట ప‌డేలా ఉంటుందా.. అని తెలియాలంటే.. రేప‌టి వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు