ఆన్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూడ్.. !

సినిమా చ‌రిత్ర‌లో శ్రీ దేవీ.. ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో అంద‌రికీ తెలుసు. చిన్న స్థాయి నుంచి అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె హఠ‌న్మ‌ర‌ణం త‌ర్వాత‌.. శ్రీ దేవీ కూతురు జాహ్ణావీ క‌పూర్ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంది. ద‌ఢ‌క్ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఈ సుంద‌రి.. ఫ‌స్ట్ మూవీతోనే సాలిడ్ హిట అందుకుంది. దీని త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. త‌ల్లి బాట‌లోనే దూసుకెళ్తుంది.

ఈ భామ సినిమాల‌తో పాటు ఓటీటీ సిరీస్ ల‌పై కూడా దృష్టి సారిస్తుంది. క‌థ న‌చ్చితే.. ఓటీటీ, మూవీ అని తేడా లేకుండా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. ఇప్ప‌టికే నెట్ ఫ్లిక్స్ లో ఘోస్ట్ స్టోరీస్, ‘గుంజన్ సక్సేనా’ ది కార్గిల్ గర్ల్ చేసి మంచి ఓటీటీ ల‌వ‌ర్స్ ను మెప్పించింది. ఈ సిరీస్ లకు మంచి టాక్ రావ‌డంతో జాహ్ణావీ ఇంట‌ర్నేష‌నల్ మూడ్ లోకి వెళ్లి పోయింది.

స్టార్ ట్యాగ్ రావాలంటే.. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ క‌నిపించాల‌ని ఈ భామ‌.. ఇంట‌ర్నేష‌నల్ ప్రాజెక్ట్ ల‌ను చేయ‌డానికీ రెడీ అవుతుంది. అందు కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఫాక్స్ స్టూడియోస్, WB, డిస్నీ ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఇప్ప‌టికే జాహ్ణావీ అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒరిజిన‌ల్ సిరీస్ చేయ‌డానికి ఓకే చెప్పింద‌ట‌. జాహ్ణావీ తో పాటు అర్జున్ క‌పూర్ మెయిన్ రోల్స్ లో క‌నిపించే ఈ సిరీస్ అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలేక్క‌నుంద‌ని బీ టౌన్ టాక్. అయితే ఈ భామ ఇంట‌ర్నేష‌నల్ ప్ర‌యోగాలు ఎంత వ‌ర‌కు స‌క్స‌స్ అవుతాయో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు