శేఖర్ సక్సెస్ ఆ.?

రాజశేఖర్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరో.
అప్పట్లో రాజశేఖర్ సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లిపోయేవాళ్ళు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మానేశారు.

రాజశేఖర్ వరుస ప్లాప్ల్స్ తో సతమతమవుతున్న తరుణంలో ప్రవీణ్ సత్తారు వచ్చి “గరుడ వేగ” సినిమాతో మంచి హిట్ ఇచ్చి రాజశేఖర్ కెరియర్ ను ట్రాక్ లో పెట్టాడు. ఆ తరువాత కాలంలో వచ్చిన “కల్కి” కూడా పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘శేఖర్’. ఈ సినిమాలో రాజశేఖర్ లుక్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది టీం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒరిజినల్ కి ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పొచ్చు.

పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా డ్యూటీ చేయని చాలామంది ఉంటారు. పోలీస్ ఉద్యోగం రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు వేలల్లో ఒక్కరు ఉంటారు” అనే డైలాగ్ తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం మంచి ఉత్కంఠను కలుగజేసింది అని చెప్పొచ్చు.
ఈ సినిమాకి రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించారు. వీరి పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించైనా ఈ సినిమా వేసవి కానుకగా మే 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు