గెలుపెవరిది.?

ఇండస్ట్రీ లో ఒక శుక్రవారం జాతకాన్ని మార్చేస్తుంది అంటారు,
ఎన్నో అంచనాలు తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని సార్లు చతికిల పడతాయి. ఏ అంచనాలు లేకుండా వచ్చే సినిమాలు కొన్ని సార్లు బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఆ తరువాత ఆయా నటులు గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఎన్ని సినిమాలు చేసిన ఒక హిట్ సినిమాకి ఉండే వాల్యూ వేరు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ దేవరకొండ వెనక్కు చూడలేదు, డీజే టిల్లు తర్వాత సిద్ధూ జొన్నలగడ్డను వెతుక్కుంటూ ఆఫర్స్ వస్తున్నాయి.
ఫలక్ నామా దాస్ హిట్ ఇప్పటకి విశ్వక్ సేన్ కి పెద్ద ప్లస్.
వీటిన్నటికి కారణం ఒకటే సినిమాలు సక్సెస్ కావడం.

అలానే ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి,
రిలీజ్ అయినా కొన్ని సినిమాలు మనకు నచ్చితే మనతో ఇంటికి వరకు వస్తాయి, కొన్ని రోజులు పాటు వాటి గురించి మాట్లాడుకుంటాం. అదే సినిమా నచ్చకపోతే అక్కడే పాప్కార్న్ కొనే దగ్గరో , పార్కింగ్ ప్లేస్ లోను మర్చిపోతాం. ప్రతి ఫ్రైడే లానే ఈ ఫ్రైడే కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, అవేంటో ఒక లుక్ వేద్దాం.

మా ఇష్టం
రామ్ గోపాల్ వర్మ
ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్ ఈయన మాత్రమే కాకుండా ఈయన దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో తమకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు.
కానీ ఈయన మాత్రం ఈ మధ్య నాసిరకం సినిమాలు తీయడం మొదలుపెట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘మా ఇష్టం’ సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

అశోక వనంలో అర్జున్ కళ్యాణం
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గతకొన్ని రోజులుగా ఈ సినిమా ప్రొమోషన్ కి చేసిన ప్రాంక్ వీడియో, ఒక ప్రముఖ ఛానల్ లో డిబేట్ ఇవన్నీ ఈ సినిమాకి మంచి పబ్లిసిటీని తీసుకుని వచ్చాయి. ఇక్కడ ఇంకో పాజిటివ్ వైబ్ కూడా ఉంది. ఆ యాంకర్ ఏ ప్రముఖ హీరోను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మంచి హిట్ కొడతారు. విజయదేవకొండ అర్జున్ రెడ్డి , సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు దీనికి నిదర్శనం, మరి రేపు రిలీజ్ కాబోయే విశ్వక్ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

జయమ్మ పంచాయితీ
క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాన్ ,సినిమాల్లో మెగాస్టార్ లా యాంకరింగ్ లో ఈమె. ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా ఈమె యాంకరింగ్ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఊహించలేము. మొదటిసారి ఫుల్ లెన్త్ సినిమా చేస్తున్న సుమక్క ఈసారి తన నటనతో ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

భళా తందనాన
శ్రీ విష్ణు వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ముందుండే కొద్ది మంది నటులలో ఒకడు. తను చివరగా చేసిన “అర్జున ఫాల్గుణ” సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన. ఈ సినిమాకి చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రేపు తలపడనుంది.

డాక్ట‌ర్స్ స్ట్రేంజ్
పాపుల‌ర్ మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న డాక్ట‌ర్స్ స్ట్రేంజ్ (Doctor Strange) సినిమా కూడా మే 6న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాకు మెట్రో సిటీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ బాగానే అవుతున్నాయి. ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన పేరెంట్స్ తమ పిల్లలతో పాటు కలిసి ఈ సినిమాకి వచ్చేస్తారు.
4 తెలుగు సినిమాలు మధ్య రిలీజ్ అవుతున్న ఈ హాలీవుడ్ సినిమాకి ఎంతవరకు ఆదరణ లభిస్తుందో రేపు తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు