NTR: తారక్ తో మొదలైన సెంటిమెంట్ తనే బ్రేక్ చేస్తాడా.?

ఇండస్ట్రీలో సక్సెస్ కి ఉండే వెల్యూ వేరు ఒక హిట్ పడితే హీరోలు పిలిచిమరీ కథలు వింటారు, ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ లు పట్టుకుని రెడీ గా ఉంటారు. కొన్నేళ్లు క్రితం వరకు ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో చేసిన ప్రతీ సినిమా తేడా కొట్టినవే. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు ఉన్నట్లు తారక్ కెరియర్ లో మలుపు అంటే టెంపర్ అని చెప్పొచ్చు.

టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా మంచి హిట్ అయింది.
మాములుగా రాజమౌళి హీరోస్ సెంటిమెంట్ గురించి మనకు తెల్సిందే.
అంటే రాజమౌళి తో సినిమా చేసి హిట్ కొట్టిన హీరోకు నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతుంది. ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో లో డైరెక్ట్ గా రాజమౌళి ను క్వశ్చన్ చేసారు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయాన్ని చిరంజీవి కూడా ప్రస్తావించారు.

అసలు ఈ సెంటిమెంట్ మొదలయింది ఎన్టీఆర్ తోనే , ఎందుకంటే రాజమౌళి మొదటి సినిమా “స్టూడెంట్ నెంబర్ 1” ఆ తరువాత ఎన్టీఆర్ చేసిన “సుబ్బు” డిజాస్టర్. “సింహాద్రి” తరువాత వచ్చిన “ఆంధ్రావాలా” కూడా డిజాస్టర్, “యమదొంగ” సినిమా తర్వాత వచ్చిన “కంత్రి” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -

అయితే తారక్ ప్రస్తుతం కొరటాల శివ తో సినిమాను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే, పైగా ఇది ట్రిపుల్ ఆర్ తరువాత తారక్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా హిట్ అవ్వడం తారక్ కంటే కొరటాల శివకు ఎక్కువ అవసరం, ఆచార్య లాంటి డిజాస్టర్ నుండి తేరుకోవడానికి బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. టెంపర్ సినిమా తరువాత ఇప్పటివరకు ఫెయిల్యూర్ చూడని ఎన్టీఆర్ కు ఈ సినిమా కూడా హిట్ అయితే, తనతో మొదలైన సెంటిమెంట్ ను తను బ్రేక్ చేసినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు