దగ్గుబాటి వెంకటేష్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏ సందర్భాన “విక్టరీ” వెంకటేష్ అని నామకరణం చేశాడో, అప్పటి నుండి వెంకీ కెరీర్ మారిపోయింది. వరుస విజయాలు, బ్లాక్ బస్టర్స్. సీరియస్ పాత్రలైనా, కామెడీ పాత్రలైనా వెంకీ దిగాడంటే విక్టరీనే. టాలీవుడ్ లో అగ్రహీరోలు ఎంత మంది ఉన్నా, వెంకీకి ప్రేక్షకులు ఇచ్చే గుర్తుంపు వేరే రేంజ్ లో ఉంటుంది.
ఆయన ఇటీవల నటించిన ఎఫ్ 3 మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సంచలనాలను నమోదు చేస్తుంది. సినీ లవర్స్ ను కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది. అంతే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు క్యూ కట్టేల చేసింది. ఈ సినిమా ఇంతలా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడనాకి కారణం విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు.
ఎఫ్ 3 మూవీలో వెంకీ కామెడీ టైమింగ్, నత్తితో వినోదాన్ని పండించడంతో టాక్ ఆప్ ది టౌన్ గా మారాడు. ఇప్పటికే లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న ఈ హీరోకు, ఈ మూవీతో మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. వెంకీ ఈ మూవీతో వరుసగా ఆరు సినిమాలు వరుసగా సాలిడ్ హిట్ అందుకున్నాడు.
దీంతో సీనియర్ సూపర్ లీగ్ లోనెంబర్ వన్ స్థాయిలో విక్టరీ వెంకటేష్ ఉన్నారని చెప్పొచ్చు. సీనియర్ హీరోల సూపర్ లీగ్ లో మిగిలిన ముగ్గురు హీరోల కంటే వెంకీ మంచి ఫలితాలను సాధిస్తూ, కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు.